విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం

మేళ్లచెరువు మండలం( జనం సాక్షి న్యూస్)

సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం, కందిబండ గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్లో పేరెంట్స్ మీటింగు నిర్వహించడం జరిగింది గత రెండు సంవత్సరాల నుండి కరోనా నేపథ్యంలో పిల్లలు కి  డిసిప్లేన్   మరియు చదువు మీద అవగాహన లేకుండా పోయింది ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం నేర్పించడం జరుగుతుంది కావున మీ పిల్లల్ని స్కూల్లోనే కాకుండా ఇంటి వద్ద చదివించాలని ఉపాధ్యాయులు పేరెంట్స్ కి తెలియజేసినారు అలాగే ఈ యొక్క స్కూల్లో బడి ఉడ్చటానికి కూడా స్వీపర్ లేడు ఎక్కడ చెత్త అక్కడనే పేరుకుపోయింది ఈ యొక్క స్కూల్లో నీళ్ల సదుపాయం లేక పిల్లలు అవస్థలు పడుతున్నారు కనీసం స్కూల్లో బియ్యం కడగటానికి కూడా నీళ్లు లేకపోవడం గమనార్హం వాటర్ ట్యాంకు ఉన్న కానీ ఉపయోగం లేదు కనీసం బ్లీచింగ్ వేసే వారే లేకపోలేదు మరియు టాయిలెట్స్ క్లీన్ చేయడానికి మనిషి లేడు నీళ్లు లేవు ఇకనైనా ప్రభుత్వం వారు ఈ యొక్క స్కూల్లో బోరు సదుపాయం కల్పించాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు