విద్యా పక్షోత్సవాలను జయప్రదం చేయండి

జిల్లా కలెక్టర్‌ సౌరభ్‌గౌర్‌ ఆదేశం
శ్రీకాకుళం, జూలై 8 :
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రత్యే క విద్యా పక్షోత్సవాలను విజయవంతం చేయా లని జిల్లా కలెక్టర్‌ సౌరభ్‌గౌర్‌ ఆదేశించారు. పాఠశాల పరిధిలోని గ్రామాలలో ప్రత్యేక బృం దాలు ఏర్పాటు చేసి బడీడు పిల్లలు పాఠశా లలో చేరేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. కలెక్టర్‌ తన కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలోనూ ర్యా లీలు నిర్వహించి ప్రజల్లో చైతన్యం తీసుకు రావాలని సూచించారు. బడిలో చేరిన పిల్లలు డ్రాపౌట్స్‌ కాకుండా చర్యలు చేపట్టాలని ఆదే శించారు. ఈ నెల 21వ తేదీ వరకు నిర్వహిం చనున్న ఈ పక్షోత్సవాలను పండుగ వాతావర ణంలో జరగాలని తెలిపారు. వసతి గృహాలు, పాఠశాలల్లో మరుగుదొడ్లు శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వసతి గృహాల్లో తాగునీరు విద్యుత్‌ సౌకర్యం కల్పిం చాలని ఆదేశించారు. పాఠశాలల్లో విద్యార్థు లకు నేత్ర వైద్య పరీక్షలు నిర్వహించాలని, అవసరమైన వారికి కంటి అద్దాలను సరఫరా చేయాలని తెలిపారు. ఈ పక్షోత్సవాలలో పాఠశాలల భవనాలను ప్రారంభించాలని, ప్ర జాప్రతినిధులను ఈ కార్యక్రమంలో భాగస్వా ములను చేయాలని పేర్కొన్నారు. ఈ సమావే శంలో జిల్లా అదనపు జేసీ రాజకుమార్‌, డీఆర్‌ డీఏ పీడీ రజనీకాంతారావు, రాజీవ్‌ విద్యా మిష న్‌ పీఓ నగేశ్‌, వయోజన విద్యా శాఖ డీడీ నాగే శ్వరరావు, డీఎంహెచ్‌ఓ శారద, డీపీఓ వెంక టేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.