విద్యా వ్యతిరేక విధానాలను ప్రతిఘటిద్దాం

పి డి ఎస్ యు జిల్లా అధ్యక్షులు సాంబ

టేకులపల్లి,అక్టోబర్ 21 (జనం సాక్షి ): విద్యా వ్యతిరేక విధానాలను ప్రతిఘటిద్దామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పిడిఎస్యు అధ్యక్షులు ఏ సాంబ అన్నారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU) టేకులపల్లి మండల మహాసభను జూనియర్ కాలేజిలో శుక్రవారం నిర్వహించారు. పిడిఎస్యు మండల నాయకులు చంద్రకళ అధ్యక్షతన జరిగిన సభలో జిల్లా అధ్యక్షుడు ఏ సాంబ పాల్గొని మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా వ్యవస్థ పై మూకుముడిగా దాడి చేస్తున్నాయని, సామాజిక అంశమైన విద్యను వ్యాపార సరుకుగా మారుస్తున్నాయని, ప్రైవేటు యూనివర్సిటీలను రాష్ట్రంలో ప్రవేశ పెడుతూ, కార్పొరేట్ విద్యా వ్యవస్థకు కొమ్ముకాస్తూ ప్రభుత్వ విద్యారంగాన్ని నీరు కారుస్తున్నారని, ప్రభుత్వ విద్యా వ్యవస్థ దెబ్బ తినడం మూలాన పేద విద్యార్థులకు విద్య దూరం అవుతుందనిఅన్నారు. కార్పొరేట్, ప్రైవేటు విద్యా సంస్థలు ర్యాంకుల వెంట విద్యార్థులను పరుగులు పెట్టించి మనసిక వత్తిడికి గురి చేస్తు వారిని బలి తీసుకుంటున్నాయనివిమర్శించారు. ప్రభుత్వ విద్యా సంస్థలలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని ఎన్నిసార్లు సమస్యలు విన్నవించిన ప్రభుత్వం స్పందించే ఉద్దేశం లేదని, కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానం పేరుతో ఒకే మతానికి కొమ్ముకాసే విధంగా విద్యా వ్యవస్థను తయారు చేస్తున్నాయనిఘాటుగా విమర్శించారు. ఇలాంటి తరుణంలో విద్యారంగంలోని సమస్యలపై పాలక ప్రభుత్వాలు తీసుకువస్తున్న విద్యా వ్యతిరేక విధానాలపై తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు అన్నారు.ఈ సభలో పిడిఎస్యు జిల్లా కోశాధికారి జె గణేష్ ప్రసంగించగా నాయకులు శ్రుతి, అభిషేక్, అభినాయ్ తదితరులు పాల్గొన్నారు.