విద్యా సంవత్సరం ప్రారంభమై నాలుగు నెలలు పూర్తి కావస్తున్నా అందని పాఠ్యపుస్తకాలు. PDSU.

ఖమ్మం జిల్లా.తిరుమలాయపాలెం. (అక్టోబర్ 11) జనం సాక్షి. విద్యా సంవత్సరం ప్రారంభమై నాలుగు నెలలు పూర్తి కావస్తున్న కూడా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందలేదని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పిడిఎస్యు) పాలేరు డివిజన్ కార్యదర్శి మాగి రాకేష్ అన్నారు. ఈరోజు తిరుమలాయపాలెం బచ్చోడు గ్రామంలో సంఘం ముఖ్య కార్యకర్తల జనరల్ బాడీ జరిగింది .ఈ సందర్భంగా మాట్లాడుతూ …… విద్యాసంవత్సరం ప్రారంభం అయి4 నెలలు పూర్తి కావస్తున్నా కూడా ప్రభుత్వ పాఠశాలలో ఇంతవరకు పూర్తి స్థాయిలో పాఠ్య పుస్తకాలు రాకపోవడం చాలా బాధాకరమైన విషయం అన్నారు.
ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల కు యూనిఫామ్స్ సకాలంలో అందించడంలో ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిందని అన్నారు.
మధ్యాహ్న భోజనానికి సంబంధించి ఒక విద్యార్థికి కేవలం 6 , 7 రూపాయలు మాత్రమే ఇవ్వడంతో మధ్యాహ్న భోజన వర్కర్లు అనేక ఇబ్బందులు పడుతున్నారని కనీసం బయటికి వెళ్తే కనీసం టీ కూడా వచ్చే పరిస్థితి లేదని , అలాంటిది విధ్యార్ధులకు పౌష్టికమైన ఆహారం ఎలా అందుతుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
కావున ఇప్పటికైనా విద్యార్థులకు మిడ్డే మిల్స్ కి నిధులను ఎక్కువగా కేటాయించి విద్యార్థులకు సరైన వసతులు కల్పించాలని అన్నారు.
విద్యార్థులకు విద్యను చదువుకునే పరిస్థితి లేదని చదువుకోనే పరిస్థితి ఉందని విచ్చలవిడిగా ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలు పెరిగిపోయి సామాన్య మధ్యతరగతి విద్యార్థులకు విద్యను దూరం చేసే ఆలోచనలు ఈ ప్రభుత్వం చేస్తుందని వారు అన్నారు
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్నం భోజన ఏర్పాటు చేయాలి అని వారు డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమంలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం(PDSU) తిరుమలాయపాలెం మండల నాయకులు మాగి విజయ్. ఇరుగువిక్రమ్. గొర్రెపాటి లెనిన్. చుంచు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.