విద్యుత్ కోత పై టీఆర్‌ఎస్ నిరసన
కరీంనగర్ టౌన్ : వేళాపాళ లేని కరెంటు కోతకు నిరసనగా, టీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు రవీందర్ సింగ్, మండల అధ్యక్షుడు నర్సయ్య ఆధ్వర్యంలో విద్యుత్ కోతలకు నిరసనగా సోయవారం ఎస్‌సీ కార్యాలయ ముట్టడి నిర్వహించారు. టీఆర్‌ఎస్ కార్యకర్తలు పెద్ద మొత్తంలో హజరై నిరసన తెలిపారు. ఈ ధర్నాలో రవీందర్ సింగ్, నర్సయ్య, ఎడ్ల అశోక్, కట్ల సతీశ్, అక్బర్, గుంజపడుగు హరిప్రసాద్, గుర్రం పద్మ, శైలజ, శ్రీలత పాల్గొన్నారు. టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు నర్సయ్య ఆధ్వర్యంలో పది మంది కార్యకర్తలు గోడ దూకి ఎస్ కార్యాయంలోకి ప్రవేశించగా, పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. కార్యకర్తలు చొప్పరి వేణు, శ్యామ్, కలర్ సత్తన్న, ఎస్‌సీ కార్యాలయంలోకి ప్రవేశించి వినతిపత్రం ఇచ్చారు.