విద్యుత్ షాక్‌కు గురై ఒక వ్యక్తి మృతి
కరీంనగర్, జూలై 17: విద్యుత్‌షాక్‌కు గురై ఒక వ్యక్తి మంగళవారం తెల్లవారు జామున మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. మలహర్‌రావు మండలంలోని గాడిచర్ల గ్రామం సమీపంలోని వ్యవసాయ భూమిలో జంతువుల వేట కోసం విద్యుత్ తీగను అమర్చారు. రైతు లక్ష్మయ్య తన పొలంలో వ్యవసాయ పనులను చేపట్టేందుకు వెళ్లారు. అటవీ ప్రాంతానికి సమీపంలో వ్యవసాయ భూములు ఉన్నందున అడవి పందులు, ఇతర జంతువులు పంటను నష్టపడుస్తుండడంతో విద్యుత్ తీగలు అమర్చారు. లక్ష్మయ్య పొలంలో పనుల నిమిత్తం వెళ్తుండగా ఆకస్మాత్తుగా కాలికి విద్యుత్ తీగ తాకడంతో షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని మంథని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మలహర్‌రావు మండల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నారు.