విద్యుత్‌ సరఫరాలో ఇక వినూత్న పద్దతి 

అంతరాయాలు లేకుండా చేసేందుకు ప్రయత్నాలు
నల్లగొండ,మే21(జ‌నంసాక్షి): విద్యుత్‌ సరఫరాలో తరచూ అంతరాయాలు తొలగించడంతో పాటు లో ఓల్టేజీ సమస్యకు చెక్‌ పెట్టబోతున్నారు. ఇందుకోసం పక్కా ప్లాన్‌ రూపొందించారు. విద్యుద్ఘాతాలు వంటివి లేకుండా ప్రణాళిక చేస్తున్నారు. ఇందులో భాగంగా పనులు చేపట్టబోతున్నారు.  కేంద్ర ప్రభుత్వం  గతేడాది దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ గ్రావిూణ జ్యోతి యోజన (డీడీయూజీజేవై)ను ప్రవేశపెట్టింది. విద్యుత్‌ పంపిణీ సంస్థ అధికారులు సమర్పించిన ప్రతిపాదనల మేరకు నిధులు మంజూరయ్యాయి. గ్రావిూణ ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరాను మెరుగుపర్చడం డీడీయూజీజేవై ప్రధాన ఉద్దేశం. యాదాద్రి భువనగిరి, నల్గొండ, సూర్యాపేట జిల్లాల పరిధిలో 5 వేలకు పైబడి ఉన్న ఆవాస గ్రామాలు, తండాల్లో విద్యుత్తు సరఫరాలో పలు సమస్యలు ఉన్నాయి. దశాబ్దాల క్రితం ఏర్పాటుచేసిన తీగలు తుమ్మితే వూడిపడే ముక్కు అన్న చందంగా గట్టిగా గాలి వీస్తే సరఫరా నిల్చిపోయే దుస్థితి ఉంది. అదనపు భారంతో తరచూ నియంత్రికలు మొరాయిస్తుండటంతో సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. లోవోల్టేజీ సమస్య తలెత్తుతోంది. గృహావసరాలు, వ్యవసాయానికి కలిపి ఒకే లైన్‌ ద్వారా సరఫరా కొనసాగుతోంది. డీడీయూజీజేవై ఇలాంటి సమస్యలకు అడ్డుకట్టు వేయనుంది. తద్వారా పంచాయతీలు, ఆవాస గ్రామాల్లో కష్టాలు తీరే అవకాశం ఉంది. పల్లెల్లో వదులు తీగల సమస్య పరిష్కారానికి అదనపు విద్యుత్తు స్తంభాలు, లైన్ల విస్తరణ, నూతన లైన్ల ఏర్పాటు, అవసరమైన మేరకు నియంత్రికల ఏర్పాటు, ఏబీ స్విచ్‌లు, కేబుల్‌
వంటి అంశాలకు చేపట్టబోయే పనుల్లో ప్రాధాన్యముంటుంది.