విద్యుత్ ఉద్యోగుల విధుల బహిష్కరణ
వరంగల్ ఈస్ట్, ఆగస్టు 08(జనం సాక్షి)
విద్యుత్ సంస్థల ప్రైవేటికరణ బిల్లు కు నిరసనగా నేషనల్ కో ఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలెక్ట్రిసిటీ ఎంప్లాయిస్ అండ్ ఇంజనీర్స్ ఇచ్చిన పిలుపు మేరకు ములుగు రోడ్డు ఆవరణలో గల ట్రాన్స్కో విద్యుత్ ఉద్యోగులు(టీఎస్ పవర్ జాక్) సోమవారం ఉదయం 6 గంటల నుండి విధులు బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా టి యెస్ పవర్ జాక్ చైర్మన్ వెంకటేశ్వర్లు ,టీ జాక్ చైర్మన్ సంపత్ రావు మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా 27 లక్షల విద్యుత్ ఉద్యోగులు రేపు విధులు బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం విద్యుత్ ప్రైవేటీకరణ బిల్లు పై వెనక్కి తగ్గకపోతే మెరుపు సమ్మెకు కూడా వెనుకడబోమని తెలిపారు. ఆదివారం వివిధ సంఘాల నాయకులు సమావేశమై కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు ఇస్తూ నిరసన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల విద్యుత్ సంఘాల నాయకులు వెంకటేశ్వర్లు, రాజ్ కుమార్,చంద్రప్రకాష్,అశోక్,దేవేం దర్ రెడ్డి, దేవా,కుమారస్వామి,యాకూబ్, సందీప్,ప్రశాంత్, మోహన్, మహేష్, శ్రీనివాసరావు, మాధవ రెడ్డి, యుగంధర్, రగోతం రెడ్డి, భరత్, అజయ్ , సంతోష్, మనోహర్, నరేష్,తిరుపతి, నాదం,ప్రకాష్,రాము, సజని,స్వప్న రూబియా బేగం, ఉద్యోగులు మరియు ఆర్టిసాన్లు పాల్గొన్నారు.