విద్యుత్‌ కుంభకోణ సూత్రధారులను శిక్షించాల్సిందే..

` ఛత్తీస్‌గఢ్‌ విద్యుత్‌ ఒప్పందంతో రూ. 2,600 కోట్ల నష్టం
` జస్టిస్‌ నరసింహారెడ్డి కమిషన్‌ ఎదుట కోదండరామ్‌ ,విద్యుత్‌ శాఖ మాజీ అధికారి రఘు వెల్లడి
` తప్పులను సమర్థించుకుంటున్న కేసీఆర్‌
` విద్యుత్‌ కొనుగోళ్లో అక్రమాలను సమర్థించుకునే యత్నం
` కమిషన్‌ ఎదుట వివరణ ఇచ్చిన ఇరువురు
హైదరాబాద్‌(జనంసాక్షి):చత్తీస్‌గఢ్‌తో విద్యుత్‌ ఒప్పందాల వల్ల 2,600 కోట్ల రూపాయల నష్టం జరిగిందని విద్యుత్‌ శాఖ మాజీ అధికారి రఘు తెలిపారు. మంగళవారం జస్టిస్‌ నర్సింహారెడ్డి కమిషన్‌ ఎదుట పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చినట్టు చెప్పారు. భద్రాద్రి, యాదాద్రి విద్యుత్‌ కేంద్రాలపై తమ వద్ద ఉన్న సమచారాన్ని కూడా అందించామని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన విూడియాతో మాట్లాడారు. ఛత్తీస్‌గఢ్‌తో తొలుత వెయ్యి మెగావాట్ల సరఫరాకు ఒప్పందం జరిగితే అది సప్లయ్‌ కాలేదని, తర్వాత తెలుసుకొని మరో వెయ్యి మెగావాట్లకు ఒప్పందం చేసుకున్నారని చెప్పారు. తరువాత తెలుసుకొని రద్దు చేసుకోవాలని ప్రయత్నిస్తే కుదరలేదన్నారు. చత్తస్‌ గఢ్‌ ఒప్పందం రెగ్యులెటరీ కమిషన్‌ ఒప్పదం పొందలేదని చెప్పారు. ఇరు రాష్టాల్ర డిస్కంలు మాత్రమే ఎంవోయూ చేసుకున్నాయని చెప్పారు. బీహెచ్‌ఈఎల్‌ కాంపిటేటివ్‌ బిడ్డింగ్‌ లో 2013`2014 88శాతం ఉంటే తర్వాత జీరోకు పడిపోయిందని చెప్పారు. మూడేళ్లలో పూర్తి కావాల్సిన యాదాద్రి ప్లాంట్‌ తొమ్మిదేండ్లయినా పూర్తి కాలేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై బీహెచ్‌ఈఎల్‌ సబ్‌ క్రిటికల్‌ టెక్నాలజీని రుద్దిందని చెప్పారు. భద్రాద్రి పవర్‌ ప్లాంట్‌ కోసం వాడిన యంత్రాలు సరైనవి కావదని అన్నారు. గోదావరిలో ప్లడ్‌ ఎక్కువైతే పవర్‌ ఎª`లాంట్‌ పై ప్రభావం పడుతుందని చెప్పారు. సాంకేతిక పరమైన అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా భద్రాద్రి పవర్‌ ఎª`లాంట్‌ నిర్మాణం చేపట్టారని ఆరోపించారు. యాదాద్రి పవర్‌ ఎª`లాంట్‌ వల్ల రవాణా చార్జీల భారం పడుతుందని చెప్పారు. ఈ విషయాలన్నీ కమిషన్‌ కు వివరించినట్టు చెప్పారు.
తప్పులను సమర్థించుకుంటున్న కెసిఆర్‌
కేసీఆర్‌ చేసిన తప్పులను సమర్థించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం ఆరోపించారు. భద్రాద్రి, యాదాద్రి పవర్‌ ప్లాంట్లు, ఛత్తీస్‌గఢ్‌ విద్యుత్‌ కొనుగోళ్ల వ్యవహారంపై జస్టిస్‌ నరసింహారెడ్డి కమిషన్‌ ఎదుట ఆయన హాజరయ్యారు. హైదరాబాద్‌ లోని బీఆర్కే భవన్‌లోని కమిషన్‌ కార్యాలయానికి కోదండరాంతో పాటు విద్యుత్‌ శాఖ అధికారి రఘు వచ్చారు. వారిద్దరి నుంచి కమిషన్‌ వివరాలు అడిగి తెలుసుకుంది. ఛత్తీస్‌గఢ్‌ తో 2000 మెగావాట్లకు ఒప్పందం చేసుకుంటే 200 మెగావాట్లు కూడా రాలేదని కాంపిటేటివ్‌ బిడ్డింగ్‌ కు వెళ్లుంటే రేట్లు తగ్గేవని.. ఎంవోయూ ద్వారా ముందుకెళ్లారని ఇది అనుమానించదగ్గదేనని కోదండరాం కమిషన్‌కు తెలిపినట్లుగా తెలుస్తోంది. ఛత్తీస్‌ గఢ్‌ తో కరెంట్‌ కొనుగోళ్లు, యాదాద్రి, భద్రాద్రి పవర్‌ ప్లాంట్లపై గతంలో అఫిడవిట్‌ వేశామని కోదండరాం విూడియాకు తెలిపారు. అందుకు సంబంధించిన ఆధారాలను కమిషన్‌ ముందు ఉంచామన్నారు. ప్రజాసంక్షేమం కోసం ప్రభుత్వం తన అధికారాన్ని ఉపయోగించాలన్నారు. అభివృద్ధి అంటే ఒకరిద్దరికి లాభం చేయడం కాదన్నారు. గత ప్రభుత్వం తొందరపాటు చర్యల వల్ల ట్రాన్స్‌కో, జెన్‌కోలకు రూ.81 వేల కోట్ల అప్పులు అయ్యాయన్నారు. గత ఏడాది వరదలు వస్తే భద్రాద్రి ప్లాంటులో విద్యుత్‌ ఉత్పత్తిని నిలిపివేయాల్సి వచ్చిందన్నారు. భవిష్యత్తులో గోదావరి వద్ద నీటి మట్టం పెరిగితే భద్రాద్రి ఎª`లాంటును కాపాడుకోగలమా? అని ఆయన ప్రశ్నించారు. గత ప్రభుత్వం నిర్ణయాల వల్ల సాధారణ ప్రజానీకానికి ఇబ్బందులు తలెత్తాయన్నారు. ఆ తప్పిదాలపై క్రిమినల్‌ చర్యలకు వెనుకాడవద్దని సూచించారు. అందరూ కూడా చట్టం ప్రకారమే నడుచుకోవాలని స్పష్టం చేశారు. మరోవైపు పవర్‌ కమిషన్‌ విచారకు సంబంధించి కేసీఆర్‌ పంపిన లేఖపై పవర్‌ కమిషన్‌ చైర్మ సవిూక్ష చేపట్టారు. భద్రాద్రి యాదాద్రి ధర్మల్‌ పవర్‌ ఎª`లాంట్‌ అంశాల్లోని కొన్ని ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారన్న కమిషన్‌ కేసీఆర్‌ చెప్పిన విషయాలను నిపుణుల కమిటీతో చర్చిస్తారు. వాస్తవాలపై ప్రతినిధులని కూడా వివరాలు అడుగనున్న కమిషన్‌ నేడు చర్చ అనంతరం దాని అనుగుణంగానే తదుపరి చర్యలు తీసుకోనున్నారు. ఈ కమిషన్‌ తీరుపై కేసీఆర్‌ ఆగ్రహంగా ఉన్నారు. విచారణ అర్హత లేదంటున్నారు. అయితే జస్టిస్‌ నరసింహారెడ్డి మాత్రం ఎవరి అభిప్రాయాలు వారు చెప్పే అవకాశం ఉందన్నారు.