విద్యుద్ఘాతంతో వ్యక్తి మృతి
నిర్మల్,ఆగస్ట్30(జనం సాక్షి): విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన సోన్ మండలంలోని సంఘంపేట్ గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. సంఘంపేట్ గ్రామానికి చెందిన బి.శ్రీనివాస్(35) పంట చేనులో ఉన్న మోటర్ పనిచేయకపోవడంతో మోటార్‌లోని వైర్లను సరిచేస్తున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా విద్యుత్ సరఫరా అయి విద్యుదాఘాతానికి గురై అక్కడిక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబాన్ని పోషించే వ్యక్తి మరణించటంతో దిక్కులేని వారమయ్యామని కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. కేసు నమోదు చేసుకుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రేమ్‌దీప్ తెలిపారు.