విపక్షాల రాస్తారోకో
రేగొండ: కాంగ్రెస్ ప్రభుత్వం పెంచిన విద్యుత్తు ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ విపక్షిల ఆధ్వర్యంలో నాయకులు మండల కేంద్రంలో రాస్తారోకో నిర్వహించారు. మండల కేంద్రంలోని భూపాలపల్లి, పరకాల ప్రధాన రహదారిపై నాయకులు బైఠాయించి ప్రభుత్వానికి వ్వతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా తెదేపా, తెరాస మండల అధ్యక్షుడు పున్నం రవి, మటిక సంతోష్‌లు మాట్లాడుతూ రైతులకు నిరంతరాయంగా ఏడు గంటల ఉచిత విద్యుత్తు అందించాలని, పెంచిన ఛార్జీలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెదేపా, తెరాస, సీపీఐ జిల్లా, మండల నాయకులు భిక్షపతి , మల్లయ్య, మల్లారెడ్డి రామచందర్‌తోపాటు కార్యకర్తలు పాల్గొన్నారు.