విభజన తర్వాత తెలంగాణను అప్పులకుప్ప చేశారు

` మద్దతుగా కేంద్రం ఎన్ని చర్యలు చేపట్టినా ఫలితం కనిపించడంలేదు
` రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై రాజ్యసభలో నిర్మలా సీతారామన్‌ కీలక వ్యాఖ్యలు
న్యూఢల్లీి(జనంసాక్షి):తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై రాజ్యసభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. విభజన నాటికి తెలంగాణ మిగులు బడ్జెట్‌లో ఉందని, ఆ తర్వాతే అప్పుల్లో కూరుకుపోయిందని అన్నారు. తమ ప్రభుత్వం ఏ రాష్ట్రం పట్ల వివక్ష చూపట్లేదని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.’’తెలంగాణ అప్పుల్లో కూరుకుపోయిన విషయం వాస్తవం. కేంద్రం ఎన్ని చర్యలు చేపట్టినా ఆ రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోతోంది. అప్పుల విషయంలో ఏ పార్టీని నిందించట్లేదు. బీబీ నగర్‌ ఎయిమ్స్‌ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. 2014 నుంచి తెలంగాణలో 2,605 కి.విూ మేర హైవేల నిర్మాణం జరిగింది. భారత్‌ మాల కింద నాలుగు గ్రీన్‌ఫీల్డ్‌ కారిడార్లు నిర్మించాం. ఈ ఏడాది తెలంగాణలో రైల్వేకు రూ.5,337 కోట్లు కేటాయించాం. ఐదు వందే భారత్‌ రైళ్లు మంజూరు చేశాం. 40 రైల్వే స్టేషన్లు ఆధునికీకరిస్తున్నాం. పీఎంఏవై కింద పట్టణాల్లో 2లక్షల ఇళ్లు నిర్మించాం. స్వచ్ఛభారత్‌ కింద 31 లక్షల మరుగుదొడ్లు నిర్మించాం. ఇందిరాగాంధీ మెదక్‌ నుంచి ప్రాతినిధ్యం వహించారు.. కానీ, మెదక్‌ జిల్లాలో మొదటి రైల్వే స్టేషన్‌ను మోదీ సర్కారే ఇచ్చింది. రామగుండం ఎరువుల కర్మాగారాన్ని మోదీ పునరుద్ధరించారు. తెలంగాణకు పసుపు బోర్డు మంజూరు చేశాం. బడ్జెట్‌లో ఏ ఒక్క రాష్ట్రానికి పెద్దపీట వేయలేదు. బడ్జెట్‌కు ముందు అన్ని రాష్ట్రాలను సంప్రదిస్తున్నాం’’ అని నిర్మలా సీతారామన్‌ తెలిపారు.

పార్లమెంట్‌లో ‘ఐటి’ రగడ
` నిరసలన మధ్యే కొత్త ఐటి చట్టం బిల్లును లోక్‌సభలో ప్రవేశ పెట్టిన నిర్మలా సీతారామన్‌
` విపక్షాల నిరసన.. వాకౌట్‌
` లోక్‌సభ మార్చి 10కి వాయిదా
ప్రస్తుతం అమలులో ఉన్న దశాబ్దాల నాటి ఆదాయపు పన్ను చట్టం స్థానంలో కేంద్రం కొత్త చట్టాన్ని తీసుకురానుంది. దీనిలో భాగంగా ఆదాయపు పన్ను (ఐటీ) నూతన బిల్లు పార్లమెంటు ముందుకు వచ్చింది. విపక్షాల నిరసనల మధ్యే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్‌లో ప్రకటించిన మేరకు బిల్లును తీసుకుని వచ్చారు. అయితే విపక్షాలు సభ నుంచి వాకౌట్‌ చేశాయి. బిల్లుకు నిరసనగా వాకౌట్‌ చేయడం గమనార్హం. అనంతరం కాసేపటికే లోక్‌సభ మార్చి 10కి వాయిదా పడిరది. 1961లో రూపొందించిన ఆదాయపు పన్ను చట్టానికి, ఎన్నో సవరణలు జరిగాయి. దీంతో సంక్లిష్టంగా తయారైంది. పన్ను చెల్లింపుదార్లకు వ్యయాలూ పెరిగాయి. దీంతో ఈ చట్టాన్ని సవిూక్షించి, సరళతరం చేస్తామని 2024 జులై బడ్జెట్‌లో ప్రభుత్వం పేర్కొంది. ఆ మేరకు ఇప్పుడు బిల్లును రూపొందించారు. ఈ చట్టాన్ని సవిూక్షించడానికి కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి ఒక అంతర్గత కమిటీని ఏర్పాటు చేసింది. చట్ట సవిూక్షకు 22 ప్రత్యేక సబ్‌ కమిటీలనూ ఏర్పాటు చేశారు. మొత్తం విూద కొత్త చట్టం సవిూక్ష నిమిత్తం 6500 సలహాలను ఆదాయ పన్ను విభాగం అందుకుంది. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుని, కొత్త బిల్లు తీసుకొచ్చారు. మొన్నటి బడ్జెట్‌లో కూడా ఆదాయపు పన్న విషయంలో సరళీకరణ చేపట్టామని అన్నారు. అందుకు అనుగుణంగా కొట్ట ఐటి చట్టానికి ఇటీవలే కేబినేట్‌ ఆమోదించింది. దానికి చట్టబద్దత కల్పించేందుకు పార్లమెంటు ముందుకు తీసుకుని వచ్చారు.