విభజించి పాలిస్తున్న నాయకులు
భీమదేవరపల్లి జూలై 05(జనసాక్షి)
జిల్లాలో లక్షమంది లంబాడ తెగకు చెందినవారున్నారని వారిలో ఐక్యత లేక పోవడంతో పాలకులు వివబజించి పాలిస్తున్నారని ఆలీండియా సేవాసంఘ రాష్ట్ర నాయకులు బానోతు రాజలింగం నాయక్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని అమరుల స్థూపం వద్ద కరపత్రాన్ని విడుదల చేశారు. ఈనెల 8న కరీంనగర్ ప్రెస్ బవన్‌లో నిర్వహిస్తున్న జిల్లా సదస్సును ఈ ప్రాంతంలోని లంబాడీలు హజరై విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షుడు కిషన్‌నాయక్, నాయకులు రాందాస్, బిక్షపతి, నెహ్రూ, కిషన్ తదితరులున్నారు