విమలకు కీర్తి కిరీటి జాతీయ పురస్కారం

 సామాజిక సేవకు బంగారు బతుకమ్మ రాష్ట్రస్థాయి పురస్కారం.
తొర్రూరు:20 అక్టోబర్ (జనంసాక్షి )
సామాజిక సేవా కార్యక్రమాలకు గాను తొర్రూరు వాసి, ధర్మశ్రీ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు ధరావత్ విమల రెండు పురస్కారాలను అందుకున్నారు.
కన్నతల్లి ఫౌండేషన్ వార్షికోత్సవ సంబరాలు తాజాగా హనుమకొండలో నిర్వహించగా ఈ కార్యక్రమంలో ధరావత్ విమలకు కీర్తి కిరీటి పేరిట జాతీయ పురస్కారాన్ని ప్రధానం చేశారు.
ఇదే వేదికలో విస్డమ్  చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు ఆమెకు బంగారు బతుకమ్మ రాష్ట్ర స్థాయి పురస్కారాన్ని అందజేశారు.
పురస్కారాలను ఏపీ రాష్ట్ర దృశ్య కళల అకాడమీ చైర్మన్ సత్య శైలజ, కన్నతల్లి ఫౌండేషన్ అధ్యక్షులు కొండమీది  రాజన్ బాబు ల చేతుల మీదుగా విమల అందుకున్నారు.
సినీ ఆర్టిస్ట్  కంచర్ల శ్రీనివాస్ రావు,
శ్రీనాధ కవి సార్వభౌమ పదమూడవ తరం వారసులు
కాగూరి  శ్రీనివాసరావు శర్మ  లు విమలను అభినందించారు.
విమల మాట్లాడుతూ.
సామాజిక సేవలో సంతృప్తి ఉందని,  దానిలో భాగంగా ధర్మశ్రీ చారిటబుల్ ట్రస్ట్ ను ఏర్పాటు చేసి పేదలకు సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు.
సామాజిక సేవా కార్యక్రమాలను గుర్తించి అనేక సేవా సంస్థలు పురస్కారాలకు ఎంపిక చేయడం ఆనందంగా ఉందన్నారు. కన్నతల్లి ఫౌండేషన్,  విస్డం చారిటబుల్ ట్రస్ట్ అందించిన కీర్తి కిరీటి,  బంగారు బతుకమ్మ పురస్కారాలు తన సామాజిక బాధ్యతను పెంచాయని పేర్కొన్నారు.
మున్ముందు సేవా కార్యక్రమాల పరంపర కొనసాగిస్తానని స్పష్టం చేశారు.
పురస్కారాల ప్రధాన
కార్యక్రమంలో కళాపోషకులు ధరావత్ ఝాన్సీ, శంకర్,  భవాని ప్రసాద్, అరుణ కావేరి తదితరులు పాల్గొన్నారు.


Sent from Email.Avn for mobile

Attachments area