విషజ్వరాలతో ప్రజల ఆదోళన
ప్రభుత్వాసుపత్రికు క్యూ కట్టిన జనం
కాకినాడ,ఆగస్ట్17(జనంసాక్షి): వర్షాకాలం సీజన్ కావడడంతో విషజ్వరాలు మళ్లీ మొదలయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పారిశుద్యంతో పాటు, దోమలతో జాగ్రత్తగా ఉండాలన్నారు. దోమల నివారణకు చర్యలు తీసుకున్నామని జిల్లా వైద్యాధికారులు అన్నారు. ఇదిలావుంటు కూనవరం మండలంలోని పలు గ్రామాల ప్రజలు డెంగ్యూ, టైఫాయిడ్, వైరల్ జ్వరాల బారినపడుతున్నారు. అధిక సంఖ్యలో ప్రజలు వస్తుండడంతో ప్రభుత్వ ఆసుపత్రి కిటకిటలాడు తోంది. ఎక్కువ మంది డెంగ్యూ, టైఫాయిడ్, వైరల్ జ్వరాలతో బాధపడుతున్నారు. రోజురోజుకూ అధికమవుతుండడంతో ఆసుపత్రిలో బెడ్‌లు కూడా దొరకడం లేదు. కొందరు ప్రభుత్వ ఆసుపత్రికి రాలేక ఆర్‌ఎంపీ వద్దే వైద్యం పొందుతున్నారు. మరోవైపు మం డలంలో వర్షాలు అధికంగా కురుస్తుండడంతో పలు గ్రామాల్లో పారిశుధ్యం పడకేసింది. దీంతో దోమలు పెరిగి జ్వరాలు ఎక్కువగా ఉంటున్నాయి. తాగేనీరు కూడా బాగోక పోవడంతో ప్రజలకు టైఫాయిడ్ జ్వరాలు వస్తున్నాయి. గ్రామాల్లో బ్లీచింగ్ చల్లించకపోవడంతోనే ఈ సమస్య నెలకొంది. గ్రామాల్లో మలేరియా దోమల నిర్మూలన ద్రావణాన్ని పిచికారీ చేయించాలని, ఫాగింగ్ కూడా చేయించాలని ప్రజలు కోరుతున్నారు.