విూ తాటాకు చప్పుళ్లుకు భయపడంభయపెడితే ఇక్కడ ఎవరూ బెరదరు

కెసిఆర్‌ వ్యాఖ్యలపై మండిపడ్డ కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి

పంజాబ్‌ తర్వాత అత్యధిక ధాన్యం కొనేది తెలంగాణలోనే

లెక్కలతో సహా వెల్లడిరచిన మంత్రి

హైదరాబాద్‌,నవంబర్‌9జనం సాక్షి

కేసీఆర్‌ బెదిరింపులకు లొంగిపోయేవారు ఎవరూ లేరని గుర్తించాలని కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. భయపెడితే బీజేపీ కార్యకర్తలు ఎవరు బెదిరిపోరన్నారు. కేసీఆర్‌ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదన్నారు. భయపెడితే బీజేపీ భయపడదంటూ తెలంగాణ సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలకు కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. రెండు రోజులుగా సీఎం కేసీఆర్‌ విూడియా సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం, బీజేపీపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. దీంతోపాటు కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి హుందాగా వ్యవహరించాలంటూ కేసీఆర్‌ సూచించారు. ఈ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి మంగళవారం విూడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్‌ రెడ్డి సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తంచేశారు. విూ తాటాకు చప్పట్లతో సమస్యలు తీరుతాయా అంటూ సీఎం కేసీఆర్‌ను కిషన్‌ రెడ్డి ప్రశ్నించారు. అవగాహన లేకుండా మాట్లాడితే ఎలా అంటూ ప్రశ్నించారు. పంజాబ్‌ తర్వాత తెలంగాణలోనే వడ్లు ఎక్కువగా కేంద్రం కొనుగులు చేసిందని కిషన్‌ రెడ్డి తెలిపారు. ధాన్యం కొనుగోళ్లను మొత్తం కేంద్రమే చేస్తుందని కిషన్‌ రెడ్డి తెలిపారు. 2014లో మోదీ ప్రభుత్వం రాక ముందు కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్టాల్ల్రో 64 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించింది. బీజేపీ ప్రభుత్వం 151 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరిస్తోందన్నారు. ప్రస్తుతం తెలంగాణలో 94 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరిస్తున్నట్లు కిషన్‌ రెడ్డి తెలిపారు. ఢల్లీిలో ధర్నాలు చేస్తే.. వాయిస్‌ పెంచితే కేంద్రం భయపడదన్నారు. కేంద్రం పంజాబ్‌ తర్వాత అత్యధిక ధాన్యాన్ని తెలంగాణలో కొంటుందన్నారు. కేంద్రం రైతులను అన్ని విధాలుగా ఆదుకుం టుందన్నారు. అత్యధికంగా పంజాబ్‌ లో 135 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరిస్తే.. ఆ తర్వాత తెలంగాణలో 94 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందన్నారు. 2020, 21 సంవత్సరంలో దేశ వ్యాప్తంగా 600 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరిస్తే. 94.54 శాతం ధాన్యాన్ని తెలంగాణను నుంచి సేకరిస్తోందన్నారు. దేశంలో బాయిల్డ్‌ రైస్‌ కు డిమాండ్‌ తగ్గిందన్నారు. తెలంగాణపై కేంద్రానికి బాధ్యత ఉందన్నారు.  2014లో 64 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని  కేంద్ర ప్రభుత్వం తీసుకుందన్నారు. 2021లో తెలుగు రాష్టాల్ర నుంచి 151 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని  కేంద్రం సేకరించిందన్నారు. 2019`20లో తెలంగాణ నుంచి 94 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించిందన్నారు. తెలంగాణలో 2014లో ధాన్యం సేకరణకు రూ. 3400 కోట్ల డబ్బును ఖర్చు పెట్టిందన్నారు. 2020, 21 లో రూ.26,646 కోట్లు సేకరణకు ఖర్చు పెడుతుందన్నారు. హుజురాబాద్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తప్పుడు ప్రచారం చేసిందన్నారు. ధాన్యం సేకరణకు మిల్లింగ్‌ చార్జీలు, బ్యాగ్‌ లు,ట్రాన్‌ పోర్ట్‌ ఖర్చులు అన్ని లెక్క గట్టి కేంద్రమే ఖర్చులు భరిస్తుందన్నారు.  ముఖ్యమంత్రి ప్రజలను రైతులను తప్పుదోవ పట్టించేలా మాట్లాడటం సరికాదన్నారు. బాయిల్డ్‌ రైస్‌ తెలంగాణాలో ఎవరు తినరన్నారు. కేరళలోను తినడం తగ్గించారన్నారు.  రైతులు బాయిల్డ్‌ రైస్‌ పండిరచరని….బాయిల్డ్‌ రైస్‌ తయారు చేసేది మిల్లర్లని… వినియోగించే పరిస్థితి లేనపుడు ప్రజాధనం వృధా అవుతుందన్నారు. 2021 లోనే 20 లక్షల మెట్రిక్‌ టన్నులు  తీసుకోవాలని.. తదుపరి మిల్లర్ల సామగ్రి మారుస్తామని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి  లేఖ రాసిందన్నారు.  భవిష్యత్తులో కేంద్రానికి దొడ్డు  బియ్యం పంపమని రాష్ట్రభుత్వం కూడా కేంద్రానికి లేఖ రాసిందన్నారు. రాష్ట్రంలో ఎంత ధాన్యం పండిస్తున్నారో ప్రభుత్వానికి అవగాహన లేదన్నారు. జీఎస్టీ మెరుగు పడటంతో పెట్రోల్‌,డీజిల్‌ రేట్లను కేంద్రం తగ్గించిం దన్నారు.