వీఆర్ఎల ముందస్తు ఆరెస్టు
బిజినేపల్లి, జనం సాక్షి .అక్టోబరు 11. హైదారాబాద్లోని ఇందిరా పార్కు వద్ద తలపెట్టిన మహిళ వీఆర్ఏ గర్జనకు వెళ్తున్న వీఆర్ఎలను ముందు గా అదుపులోకి తీసుకొని ఆరెస్టు చేసినట్లు మంగళవారం వీఆర్ఎల సంఘం మండల అధ్యక్షుడు సలేశ్వరం తెలిపారు. వీఆర్ఎల సమస్యల పట్ల ప్రభుత్వం స్పందించకుండా కాలయాపన చేస్తుందని విమర్శించారు. మునుగోడు ఎన్నికపై ఉన్న శ్రద్ధ వీఆర్ఏల సమస్యల పరిష్కరించడంపై లేదన్నారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఇందిర పార్కు వద్ద మహిళ వీఆర్ఏలు నిర్వహిస్తున్న నిరసన గర్జనకు వెళ్ళనివ్వకుండా పోలీసులతో ప్రభుత్వం అరెస్టులు చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టని ఆవేదన వ్యక్తం చేశారు. సొంత పూచికత్తుతో వీఆర్ఏ లను వదిలేసినట్లు ఎస్సై కృష్ణ ఒబుల్ రెడ్డి తెలిపారు.