వీఆర్ఏలను కనుకరించని రాష్ట్ర ప్రభుత్వం

 వీఆర్ఏ జేఏసీ జిల్లా కన్వీనర్ ఏనుగు రాజబాబు
మల్హర్, జనంసాక్షి
 గత 75 రోజులుగా తిండి, తిప్పలు, మానుకొని రాష్ట్ర వ్యాప్తంగా విఆర్ఏలు నిరవధిక సమ్మెను కొనసాగిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రికి వీఆర్ఏల మీద కనికరం లేకుండా పోయిందని విఆర్ఏల జాక్ జిల్లా కన్వీనర్ ఏనుగు రాజబాబు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన నిరవధిక దీక్ష శిబిరంలో వారు మాట్లాడుతూ ఇకనైనా తెలంగాణ ప్రభుత్వం మొండి వైఖరిని వీడనాడి పేస్కేల్,వారసత్వపు ఉద్యోగాలు,ప్రమోషన్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వీఆర్ఏల రాష్ట్ర జేఏసీ కమిటీ పిలుపు మేరకు త్వరలోనే వీఆర్ఏలు ఎక్కడికక్కడ ముట్టడి,ధర్నాలు,రాస్తారోకాలు చేస్తామని ముందస్తుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల జేఏసీ చైర్మన్ నారా రామయ్య మహిళా అధ్యక్షురాలు చంద్యల స్వర్ణలత కుర్రే కుమార్ రవి లక్ష్మి నీరజ వీరస్వామి అంకమ్మ రాజేష్ సారమ్మా పాల్గొన్నారు
Attachments area