వీఆర్ఏలు చేస్తున్న రిలే నిరాహార దీక్షకు మద్దతు తెలిపిన బిఎస్పి నాయకులు

బయ్యారం,జులై29(జనంసాక్షి): బయ్యారం మండలంలో వీఆర్ఏలు చేస్తున్న రిలే నిరాహార దీక్ష మద్దతుగా శుక్రవారం ఇల్లందు నియోజకవర్గ అధ్యక్షులు బాదావత్ ప్రతాప్ సంఘీభావం తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండుసార్లు అసెంబ్లీ సాక్షిగా 2017,2020 సంవత్సరంలో వీఆర్ఏల డిమాండ్లను అమలు చేస్తామని చెప్పి, ఇప్పుడు వరకు అమలు జరగలేదని,వీఆర్ఏలకు ఇచ్చిన హామీలను కెసిఆర్ వెంటనే అమలు చేయాలని బీఎస్పీ నాయకులు డిమాండ్ చేశారు. వీఆర్ఏ లకు పే-స్కేల్ జీవోని విడుదల చేసి అమలుపరచాలని,అర్హత కలిగిన వారికి పదోన్నతలు కల్పించాలని, 55 సంవత్సరాల పైబడిన వారికి వారసత్వం ఉద్యోగాలు ఇవ్వాలని,పెన్షన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా మహిళా వీఆర్ఏలకు ప్రసూతి సెలవులు కల్పించాలని,సీఎం కేసీఆర్ వీఆర్ఏల సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్రమంతటా బీఎస్పీ తరఫున వీఆర్ఏ లకు మద్దతు తెలిపి ధర్నాలు చేస్తామని హెచ్చరించారు.బహుజన రాజ్యంలో ఉద్యోగస్తులు,ప్రజలు సంతోషంగా, ఉన్నత ప్రమాణాలతో జీవనం సాగిస్తారన్నారు.ఈ కార్యక్రమంలో గార్ల-బయ్యారం మండలాల ఇన్చార్జి అజ్మీర వెంకన్న, మాలోత్ సందీప్, మునగలేటి వీరస్వామి, మంద కుమార్, చిర్ర రామకృష్ణ, మరియు వీఆర్ఏ జేఏసీ నాయకులు దామోదర్, సుమన్, జ్యోతి, యమునా,బేబీ, ముత్తయ్య, అరుణ,మోహన్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.