వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి.

పినపాక నియోజకవర్గం జూలై 26 (జనం సాక్షి):

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఏ లు చేసున్న దీక్ష న్యాయమైనదనీ వారి డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని సామాజిక కార్యకర్త కర్నె రవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం మణుగూరు, పినపాక, అశ్వాపురం, బూర్గంపాడు,కరకగూడేం, గుండాల, ఆళ్ళపల్లి మండలాల్లో వీఆర్ఏలు చేస్తున్న దీక్షకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. వీఆర్ఏల దీక్షాలో భాగంగా మణుగూరు శిబిరాన్ని సందర్శించి వారికి సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి వీఆర్ఏలకు పే స్కేలు అమలు చేస్తామని హామీ ఇచ్చి అమలు చేయకపోవడం సరైంది కాదన్నారు. అర్హత కలిగిన వీఆర్ఏలకు పదోన్నతి కల్పించాలని 55 సంవత్సరాలు నిండిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగ అవకాశం, పెన్షన్ సౌకర్యం కల్పించాలని వీఆర్ఏలు చేస్తున్న డిమాండ్లు న్యాయమైనవని,డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.వీఆర్ఏల న్యాయమైన పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు. కర్నెరవి తెలిపారు