వీఆర్ఏల పట్ల పోలీసుల దౌర్జన్యం సరైంది కాదు

సిపిఎం జిల్లా కార్యదర్శి మోకు కనక రెడ్డి జనగామ (జనం సాక్షి)జూలై23:జనగామ జిల్లా కేంద్రంలో వీఆర్ఏల పట్ల పోలీసుల దౌర్జన్యం సరైంది కాదని పిడి గుద్దులు గుద్ది గాయపరిచినటువంటి పోలీసుల పైన చర్యలు తీసుకోవాలని వీఆర్ఏల పట్ల దయాకర్ రావు వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్లు సిపిఎం జిల్లా కార్యదర్శి మోకు కనక రెడ్డి,సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రాపర్తి రాజు రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి భూక్యా చందు నాయక్ తెలిపారు.జనగామ పోలీస్ స్టేషన్లో అరెస్టయి గాయపడిన వీఆర్ఏలను సిఐటియు సిపిఎం రైతు సంఘం ఐద్వా డివైఎఫ్ఐ ప్రజా సంఘాల జిల్లా నాయకత్వం పరామర్శించి వారికి మద్దతు తెలిపారు అరెస్టైన వీఆర్ఏ ల ను వెంటనే విడుదల చేయాలని స్థానిక సీఐ తో చర్చించడం జరిగింది సానుకూలంగా స్పందించిన సీఐ వారిని విడుదల చేశారు.ఈ సందర్భంగా సిపిఎం ప్రజా సంఘాల జిల్లా నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలని జిల్లా మంత్రికి సమస్యలు తెలిపేందుకు వెళ్ళితే పోలీసులతో అడ్డుకోవడం దారుణం అన్నారు మహిళా విఆర్ఎల పట్ల అనుచితంగా వ్యవహరించడం గాయపరచడం సిగ్గుచేటని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని హితువు పలికారు మద్దతు తెలిపిన వారిలో ఐద్వా జిల్లా కార్యదర్శి ఇర్రి అహల్య సిఐటియు జిల్లా అధ్యక్షులు బొట్ల శ్రీనివాస్ సిఐటియు జిల్లా కోశాధికారి జోగు ప్రకాష్ డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి దూసరి నాగరాజు కేజీ కే ఎస్ జిల్లా కార్యదర్శి వెంకటమల్లయ్య మల్లేష్ రాజ్ కళ్యాణం లింగం కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.