వీఆర్ఏల పట్ల సీఎం మొండి వైఖరి విడాలి

సిపిఐ(ఎం) మండల కార్యదర్శి కొంగరి వెంకట మావో
చేర్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 02 : వీఆర్ఏల పట్ల సీఎం కేసీఆర్ మొండి వైఖరి వీడి వారికిచ్చిన హామీలను వెంటనే అమలు చేసి సమ్మెను విరమింప జేయాలని సిపిఐ(ఎం) మండల కార్యదర్శి కొంగరి వెంకట మావో డిమాండ్ చేశారు. శుక్రవారం వారికి మద్దతు తెలిపిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. వీఆర్ఏలు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం 40 రోజుల నుండి సమ్మె చేస్తున్నా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పట్టడం లేదని విమర్శించారు. కార్యాలయంలో, గ్రామాలలో రెవెన్యూ రికార్డులను భద్రపరిచి రైతుల ప్రతి సమస్యలో పై అధికారులకు సహాయకారిగా పనిచేసే వీఆర్ఏలను ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని వీఆర్ఏలను నిర్లక్ష్యపరిస్తే రైతులను, ప్రజలను, రైతుల భూ సమస్యను నిర్లక్ష్యపరిచినట్లేనని ఎంతో కీలకంగా రెవెన్యూ వ్యవస్థలో పనిచేస్తున్న కిందిస్థాయి ఉద్యోగులను పట్టించుకోకపోవడం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తగదని వెంటనే వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎం) మండల కమిటీ సభ్యుడు గొర్రె శ్రీనివాస్, రాములు, నాలుగు మండలాల వీఆర్ఏలు పాల్గొన్నారు.