వీఆర్ఏ లకు పేస్కేల్ జిఓ విడుదల చేయకపోతే విడతల వారగా నిరసనలు
వీఆర్ఏల సంఘం జేఏసీ అధ్యక్షులు విజయ్….
నాగర్ కర్నూల్ రూరల్ జులై 19(జనంసాక్షి)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చిన పేస్కేల్ వెంటనే అమలు పరచాలని వీఆర్ఏల సంఘం జేఏసీ చైర్మన్ విజయ్ డిమాండ్ చేశారు.మంగళవారం స్థానిక ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి చేరవేయడంతో పాటు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెవెన్యూ భూరికార్డుల ప్రక్షాళన ధరణి వంటి ముఖ్యమైన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుపోయి విజయవంతం చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం లేదని మండిపడ్డారు.సకలజనుల సమ్మెలో వీఆర్వోలు వీఆర్ఏలతో పాటు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడితే చివరకు రాష్ట్ర ప్రభుత్వం వీఆర్ఏలను చులకన భావంతో చూస్తోందని మండిపడ్డారు.ఉద్యోగులుగా పనిచేస్తున్న తమకు గ్రామంలో ఫుల్ టైం ఉద్యోగులుగా పెట్టి చేయించుకొని తీరా ప్రభుత్వం తమను పట్టించుకోవడంలేదని మండిపడ్డారు అర్హత కలిగిన వారికి ప్రమోషన్లు వారసత్వ ఉద్యోగాలు తదితర ముఖ్యమైన సమస్యలను ప్రభుత్వానికి చెప్పుకునేందుకు కూడా అవకాశం లేకుండా ప్రభుత్వం కట్టడి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వం స్పందించేదాకా ఇప్పటినుంచి ఉద్యమ కార్యాచరణ చేపడుతున్నట్లు అన్ని వీఆర్ఏల సంఘం జేఏసీ స్పష్టం చేసింది జూలై 20,21,22,23తేదీల్లో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాలు చేపడుతూ,ప్రభుత్వానికి సమ సమస్యలను విన్నవించుకుంటామని అయినప్పటికీ స్పందించకపోతే 25నుండి సమ్మెలోకి దిగుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో నాగరాజు,భి.నిరంజన్,భాస్కర్,విష్ణు,శోభారాణి,ప్రసన్న,ఖాజా,భాను తదితరులు పాల్గొన్నారు.