వీఆర్ఏ లను వెంటనే ప్రభుత్వ విభాగంలో విలీనం చేయాలి
జాక్ చైర్మన్ బైరవబట్ల చక్రధర్
చేర్యాల (జనంసాక్షి) అక్టోబర్ 08 : ధరణి వ్యవస్థ పేరుతో ఉన్న రెవెన్యూ పరిపాలన గ్రామాల్లో అస్తవ్యస్తంగా తయారయిందని అధికారులను గ్రామస్తులను సమన్వయం చేసే విఆర్ఏ లను ముఖ్యమంత్రి కెసిఆర్ పట్టించుకోకపోవటం శోచనీయం అని జాక్ చైర్మన్ భైరవభట్ల చక్రధర్ అన్నారు. శనివారం చేర్యాల మండల కేంద్రంలోని గత 77 రోజులుగా జరుగుతున్న విఆర్ఎ ల దీక్షా శిబిరాన్ని సందర్శించి వారికి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ మాట్లాడి విఆర్ఎ లను ఇతర విభాగాల్లో విలీనం చేస్తామని ప్రకటన చేసిన విషయం నెలరోజులు గడుస్తున్నా కార్యరూపం దాల్చక పోవటం చాలా దురదృష్టకరం అన్నారు. సాక్షాత్తు చట్ట సభలో సీఎం ఇచిన ప్రకటన కు విలువ లేకుంటే ఇది ప్రజాస్వామ్య మేనా ? అని నాకు అనుమానం వస్తోందని చక్రదారి వాపోయారు. బ్రిటిష్ కాలం నుండి ఉన్న విఆర్ ఎ వ్యవస్థను ఒక్కసారిగా తీసివేయటం. కనీసం ఇతర డిపార్ట్మెంట్ ల కు బదిలీ చేయకుండా జీతాలూ ఇవ్వ కుండా వేల కుటుంబాలను ఇబ్బందులకు గురిచేయడం కేసీఆర్ ప్రభుత్వ నియంతృత్వ పోకడలకు నిదర్శనమని విమర్శించారు. దీక్షా శిబిరం నుండి సీసీ ఎల్ ఎ సెక్రటరీ హైమవతి, ప్రభుత్వ రెవెన్యూ జాయింట్ కార్యదర్శి రాంసింగ్ లతో టెలిఫోన్ లో మాట్లాడారు. నేటి వరకు విఆర్ఎల విలీన ప్రక్రియకు సంబంధించి ఎలాంటి ఫైల్ ముందుకు వెళ్లలేదని అసెంబ్లీలో చేసిన ప్రకటన రాజకీయంకు సంబంధించి నదని ఇద్దరు అధికారులు చేప్పటం వింటుంటే ప్రభుత్వం విఆర్ఎ లకు చేస్తున్న మోసం బట్టబయలు అయ్యిందని పేర్కొన్నారు. ఉద్యమాన్ని ఉధృతం చేసే కార్యక్రమంలో జాక్ తమ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా విఆర్ఎ శిబిరానికి మద్ధతుగా 5 వేల రూపాయలు జిల్లా కార్యదర్శి కరుణాకర్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా కార్యదర్శి అందే బీరన్న, బీఎస్పీ నాయకులు కిషన్ నాలుగు మండలాల విఆర్ఎల
సంఘం నాయకులు పాల్గొన్నారు.
Attachments area