వీఆర్‌ఏల పోలీసుల అరెస్టు

 హైదరాబాద్‌: న్యాయంగా తమకు రావాల్సిన జీతాల కోసం ఉద్యమిస్తున్న వీఆర్‌ఏలను పోలీసులు అరెస్టు చేశారు. జీఓ ప్రకారం వేతనాలు చెల్లించాలంటూ వీఆర్‌ఏలు సోమవారం అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు ఉద్యమకారుల్ని ఇందిరాపార్కు వద్ద అడ్డగించి, కొందరిని అరెస్టు చేశారు.