వీధిదీపాలకు సౌరవిద్యుత్
` వినియోగంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించండి
` పెద్ద కంపెనీల నుంచి టెండర్ల ఆహ్వానించండి
` ఐఐటి సంస్థలతో ఆడిటింగ్ జరిపేలా చర్యలు తీసుకోండి
` అధికారులతో సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్ ఆదేశం
హైదరాబాద్(జనంసాక్షి):వీధిదీపాల నిర్వహణ కోసం పెద్ద కంపెనీల నుంచి వెంటనే టెండర్స్ పిలవాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సోమవారం బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో మున్సిపల్, పంచాయతీ రాజ్, జీహెచ్‌ఎంసీ అధికారులతో సీఎం రేవత్‌రెడ్డి సవిూక్ష సమావేశం నిర్వహిచారు. ఈ సమావేశంలో అధికారులకు పలు అంశాలపై సీఎం రేవంత్‌రెడ్డి దిశానిర్దేశర చేశారు. వీధి దీపాలకు సోలార్ పవర్‌ను వినియోగించడంపైన సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సూచించారు. ఐఐటీ లాంటి సంస్థలతో థర్డ్ పార్టీ ఆడిట్ చేయించాలని మార్గనిర్దేశర చేశారు. రాష్ట్రంలోని అన్ని వీధిదీపాలను కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానం చేయాలని ఆదేశించారు. ఏఐతో ఎప్పటికప్పుడు విశ్లేషణ చేయాలని సూచించారు. గ్రామాల్లో వీధిదీపాల నిర్వహణను గ్రామ పంచాయతీకి అప్పగించాలని మార్గనిర్దేశర చేశారు . రాష్ట్రంలో వీధిదీపాల ఏర్పాటు-, నిర్వహణలో సమూల మార్పులు తీసుకురావాలని ముఖ్యమంత్రి ఏ. రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సీఎం సలహాదారు వేమ నరేందర్‌రెడ్డి, సీఎంఓ ముఖ్య కార్యదర్శి శేషాద్రి, సీఎంఓ కార్యదర్శి మాణిక్ రాజ్, పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్. శ్రీధర్, మున్సిపల్ శాఖ కార్యదర్శి శ్రీదేవి, కోర్ అర్బన్ ఏరియా మున్సిపల్ సెక్రటరీ ఇలంబర్తి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్‌తో పాటు- అనేక ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో వీధిదీపాల ఏర్పాటు-, నిర్వహణ కోసం పెద్ద కంపెనీల నుండి -టె-ండర్లను పిలవాలని సూచించారు. దీనివల్ల పారదర్శకత పెరిగి, సేవల నాణ్యత మెరుగుపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే, వీధిదీపాల కోసం సౌరశక్తి వినియోగం సాధ్యాసాధ్యాలను లోతుగా పరిశీలించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. వీధిదీపాల పనితీరును నిర్ధారించడానికి ఐఐటీ- వంటి ప్రతిష్టాత్మక సంస్థలతో థర్డ్ పార్టీ ఆడిట్ చేయించాలని సీఎం ఆదేశించారు. అంతేకాకుండా, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని వీధిదీపాలను కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానం చేసి, కేంద్రంగా పర్యవేక్షించే విధానాన్ని రూపొందించాలని సూచించారు. దీని ద్వారా ప్రతి దీపం స్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. వీధిదీపాల నిర్వహణలో ఆధునిక సాంకేతికతను ఉపయోగించాలని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. కృత్రిమ మేధస్సు ద్వారా ఎప్పటికప్పుడు విశ్లేషణ జరిపి, సమస్యలను ముందుగానే గుర్తించి పరిష్కారాలు తీసుకోవాలని సూచించారు. సీఎం రేవంత్ ప్రకారం, గ్రావిూణ ప్రాంతాల్లో వీధిదీపాల నిర్వహణను పూర్తిగా గ్రామపంచాయతీలకే అప్పగించాలని నిర్ణయించారు. సర్పంచ్‌లకు దీపాల ఏర్పాటు-, నిర్వహణపై పూర్తి అధికారం ఇవ్వబడుతుంది. అయితే, ఈ పనులపై ఎంపీడీవో స్థాయిలో పర్యవేక్షణ ఉండాలని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి వీధిదీపం, ప్రతి పోల్‌పై సర్వే చేయాలని సీఎం ఆదేశించారు. దీని ద్వారా సమస్యలు, లోపాలు, అదనపు అవసరాలను గుర్తించి త్వరితగతిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటు-ందని అన్నారు. వీధిదీపాల వ్యవస్థను ఆధునీకరించడానికి తీసుకుంటున్న ఈ చర్యలు రాబోయే రోజుల్లో రాష్టాన్రికి ఒక మోడల్‌గా నిలుస్తాయని సీఎం రేవంత్ అభిప్రాయపడ్డారు. పారదర్శక విధానాలు, సాంకేతిక ఆధారిత పర్యవేక్షణ, గ్రావిూణ స్థాయి అధికారానికి బాధ్యత కల్పించడం ద్వారా వీధిదీపాల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించగలమన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
సిఎం రేవంత్‌తో యూఎస్ కాన్సూల్ జనరల్ విలయమ్స్ భేటీ
హైదరాబాద్(జనంసాక్షి):ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని యూఎస్ కాన్సులేట్ కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్ మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా తెలంగాణ అభివృద్ది, తదితర అంశాలను వీరు చర్చించారు. ఇఈవలే విలియమ్స్ హైదరాబాద్ కాన్సూల్జనరల్‌గా బాధ్యతలు స్వీకరించారు.