వీరనారి చాకలి ఐలమ్మకు ఘన నివాళి
సూర్యాపేట టౌన్ (జనంసాక్షి):వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా శనివారం తెలంగాణ రజక ఉద్యోగ సమాఖ్య జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం
ఆ సంఘ జిల్లా అధ్యక్షులు నిమ్మల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అక్కినపల్లి పున్నయ్య హాజరై మాట్లాడారు.తెలంగాణ ప్రభుత్వం జయంతి వేడుకలతో పాటు వర్ధంతి వేడుకలను కూడా అధికారికంగా నిర్వహించాలని కోరారు.తెలంగాణ రైతాంగ పోరాటంలో ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి దొరలకు వ్యతిరేకంగా ఆమె చేసిన పోరాటం మరువలేనిదన్నారు.తాను నమ్మిన సిద్ధాంతం, తనను నమ్ముకున్న ప్రజల కోసం చివరి వరకు పోరాటం చేసిన యోధురాలు,మహనీయురాలైన ఐలమ్మ రజక కులంలో జన్మించడం తమ అదృష్టమన్నారు.ఆమె ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని కోరారు.అనంతరం ఉపాధ్యాయులు చిక్కుల గోవింద్, పగిళ్ల రమేష్ , నిమ్మల నిర్మల , జిల్లేపల్లి జానయ్య లను ఘనంగా సన్మానించారు.ట్రిపుల్ ఐటీ, బాసరలో సీటు వచ్చిన తాడూరి అరవింద్ ని సన్మానించి , రూ.2 వేలు బహుమతిగా అందజేశారు.ఈ కార్యక్రమంలో గెజిటెడ్ హెచ్ఏం పిల్లుట్ల శ్రీహరి , గౌరవ అధ్యక్షులు లింగంపల్లి భద్రయ్య , గౌరవ సలహాదారులు రాచూరి ప్రతాప్ , జిల్లా ప్రధాన కార్యదర్శి కొనుగోటి కోటయ్య , జిల్లా కోశాధికారి రాచకొండ నాగయ్య , చెరుకు సింహాద్రి , పొన్నాల నరసయ్య , మేడిపల్లి కిరణ్, అరుణ, రామకృష్ణ, రాంబాబు, హరిప్రసాద్ , వెంకన్న , రాంబాబు, రాము తదితరులు పాల్గొన్నారు.