వీరనారి చాకలి ఐలమ్మ ప్రదర్శించిన పోరాట పటిమ స్ఫూర్తిదాయకం:: జిల్లా అడిషనల్ కలెక్టర్ వైవి గణేష్.
ములుగు బ్యూరో,సెప్టెంబర్26(జనం సాక్షి):-
వీరనారి చాకలి ఐలమ్మ ప్రదర్శించిన పోరాట పటిమ స్ఫూర్తిదాయకమని జిల్లా అడిషనల్ కలెక్టర్ వైవి గణేష్ అన్నారు.సోమవారం జిల్లా సంక్షేమ భవనంలో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 127 వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి జిల్లా అడిషనల్ క్యారెక్టర్ వైవి గణేష్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ
వీరనారి చాకలి ఐలమ్మ ప్రదర్శించిన పోరాట పటిమ స్ఫూర్తిదాయకమని విద్య లేని ఆనాటి రోజుల్లో వెట్టి చాకిరీ నిర్మూలించడం కోసం తన పిల్లలు కుటుంబాన్ని పణంగా పెట్టి అణిచివేతను ఎదిరించి పోరాటం చేసిన ఐలమ్మ జీవితం స్ఫూర్తిదాయకమని అదనపు కలెక్టర్ అన్నారు.నాటికి నేటికి సమాజంలో కొంత మార్పు వచ్చిందని చాకలి ఐలమ్మ పేరు చరిత్రలో నిలిచిపోయిందని ఆమె స్ఫూర్తితో ప్రజా సంఘాలు కొంత సామాజిక స్ఫూర్తిని సమాన అవకాశాల కోసం ముందుకు రావాలని తాను భావిస్తున్నానని అన్నారు.ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ అధికారి ఎస్ లక్ష్మణ్,షెడ్యూల్ కులాల సంక్షేమ అధికారి పీ భాగ్యలక్ష్మి,రజక సంఘం జిల్లా అధ్యక్షుడు నేరెళ్ల శంకర్,బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి మొగుళ్ల భద్రయ్య,ఇంచర్ల పిఎస్సిఎస్ చైర్మన్ చిక్కుల రాములు,రజక సంఘం నాయకులు జాలిగం శ్రీనివాస్, సంగా రంజిత్,చల్లగురువుల రాజు,చాపర్తి రాజు,సారంగం, సది,సదానందం తదితరులు పాల్గొన్నారు.