వీరులకు శౌర్యచక్ర ప్రదానం చేసిన రాష్ట్రపతి
న్యూఢిల్లీ, ఏప్రిల్ 27 (జనంసాక్షి):
రాష్ట్రపతి భవన్‌లో శనివారంనాడు శౌర్య చక్ర పురస్కారాల ప్రదా నోత్సవ కార్యక్రమం జరిగింది. శౌర్య చక్ర అవార్డు గ్రహీతలకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అవార్డుల ను అందజేశారు. అత్యంత వేడుకగా జరిగిన ఈ కార్యక్ర మానికి ఉప రాష్ట్రపతి హమీద్ అ న్సారి, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, రక్షణ శాఖ మంత్రి ఆంటోని, ఆర్మీ చీఫ్ జనరల్ బిక్రమ్‌సింగ్, తదితరులు హాజరయ్యారు.