వీరుల త్యాగాలను నేటి యువత స్పూర్తిగా తీసుకోవాలి….

టేకుమట్ల.సెప్టెంబర్17(జనం సాక్షి)నిజాం నిరంకుశ పాలన నుండి తెలంగాణ ప్రాంత స్వాతంత్రం కోసం పోరాడిన వీరుల త్యాగాలను నేటి యువత స్పూర్తిగా తీసుకోవాలని ఆర్ ఎన్ ఆర్  సేవాదళ్ వ్యవస్థాపకులు  కటంగూరి రాం నర్సింహారెడ్డి అన్నారు.శనివారం తెలంగాణ విమోచన దినోత్సవం పురస్కరించుకుని నైజాం విముక్త స్వాతంత్ర అమృతోత్సవాలు ఉత్సవ సమితి మండల అద్యక్షులు ఎక్కటి శ్రీధర్ రెడ్డి అధ్వర్యంలో టేకుమట్ల మండల కేంద్రంలో కటంగూరి రాం నర్సింహారెడ్డి  హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం 1947న వస్తే తెలంగాణ ప్రాంతానికి సెప్టెంబర్17, 1948న నైజాం రజాకార్ల నుండి తెలంగాణ రాష్ట్రం విముక్తి కలిగిందని అన్నారు.అసలైన స్వాతంత్ర్యం సెప్టెంబర్ 17 1948న తెలంగాణకు రావడం జరిగిందని అన్నారు.అదే విధంగా రజాకారుల పాలనలో తెలంగాణలోని ప్రజలు అనేక విధాలుగా కష్టాలు పడుతూ చాలా ఇబ్బందులకు గురవడం జరిగిందని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో ఉత్సవ సమితి సభ్యులు రాజయ్య, యాదగిరి,వేణుగోపాల్ రెడ్డి,మోతే మహేందర్, తదితరులు పాల్గొన్నారు.