వృత్తి ధర్మాన్ని పాటిస్తూ జర్నలిస్టు జమీర్ అమరులయ్యారు

నాగర్ కర్నూలులో జమీర్ కు జర్నలిస్టుల ఘననివాళి

నాగర్ కర్నూల్ రూరల్:జులై 16(జనంసాక్షి)

వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తూ జగిత్యాల జిల్లా ఎన్టీవీ జర్నలిస్టు మహమ్మద్ జమీర్ అసువులు బాసారని ఆయనకు జర్నలిస్టు కుటుంబం ఘన నివాళులు అర్పిస్తుందని సీనియర్ జర్న లిస్టులు అబ్దుల్లా ఖాన్,కందికొండ.మోహన్,జెమినీ సురేష్ లు అన్నారు.శనివారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని నల్లవెల్లి కూడలిలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద జర్నలిస్ట్ జమీర్ కు ఘన నివాళులు అర్పించారు.జగిత్యాల ఎన్టీవీ జర్నలిస్ట్ తన వృత్తి ధర్మంలో భాగంగా వరదల్లో చిక్కుకున్న 11మందిని తన వార్తల ద్వారా ప్రాణాలను కాపాడాలన్న సంకల్పంతో అధికారులను అప్రమత్తం చేసి తాను వార్త సేకరణ కోసం వెళ్లి వరద తాకిడికి గురై ప్రాణాలు కోల్పోయారన్నారు.జగిత్యాల జిల్లాలో జర్నలిస్టుగా మంచి పేరు సంపాదించిన జమీర్ మృతి జర్నలిస్టు కుటుంబాలలో తీవ్ర బాధను కలిగించిందన్నారు.జర్నలిస్టులు తమ వృత్తిలో భాగంగా పనిచేస్తూనే జాగ్రత్తలను పాటించాలని వారు కోరారు.జర్నలిస్టు జమీర్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుంద