వృద్ధిరేటు ఢమాల్‌

4.80 శాతంగా నమోదు
పదేళ్లలో ఇదే కనిష్టం
న్యూఢల్లీి, మే 31 (జనంసాక్షి) :
జీడీపీ వృద్ధిరేటు ఢమాల్‌ అంది. గత పదేళ్లలో కనిష్ట స్థాయిలో వృద్ధి రేటు నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం నాలుగో తైమ్రాసికంలో జీడీపీ వృద్ధిరేటు 4.8 శాతంగా నమోదైంది. అయితే, ఇంతటి నిరాశపూరిత వాతావరణం మధ్య ఆశలు రేకెత్తించే అంశం ఒకటుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో అమెరికా, చైనా తర్వాతి స్థానంలో జపాన్‌ను వెనక్కు నెట్టి ఇండియా మూడో స్థానంలోకి చేరుకుంది. పారిస్‌ కేంద్రంగా పని చేస్తున్న ఓఎస్‌డీ ఈ విషయం వెల్లడిరచింది. వచ్చే కొన్ని సంవత్సరాల్లో చైనా అమెరికా ఆర్థిక వ్యవస్థ కంటే పెద్దదిగా మారుతుందని ఈ సంస్థ పేర్కొంది. వ్యవసాయం, తయారీ, మైనింగ్‌ రంగాల్లో ప్రతికూలత వల్ల ఆర్థిక వృద్ధి రేటు తగ్గుముఖం పట్టింది. ఫలితంగా గత జనవరి`మార్చి తైమ్రాసికంలో వృద్ధిరేటు 4.8 శాతంగా నమోదైంది. 2012`13 ఆర్తిక సంవత్సరంలో జీడీపీ 5 శాతానికి పడిపోవడం గత పదేళ్లలోనే తొలిసారి. గత ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు 5.1 శాతంగా ఉంది. 2011`12 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 6.2 శాతం నమోదు కాగా ఆ తర్వాతి ఆర్థిక సంవత్సరంలోని  తైమ్రాసికాల్లో వరుసగా 5.4, 5.2, 4.7 శాతం మేర పడిపోయిందని కేంద్ర ఆర్థిక గణాంక సంస్థ (సీఎస్‌ఓ) తెలిపింది. 2012`13 వివరాలను సీఎస్‌ఓ శుక్రవారం విడుదల చేసింది. 2012`13 చివరి తైమ్రాసికంలో తయారీ రంగంలో 2.6 వృద్ధి నమోదు కావాల్సి ఉండగా కేవలం 0.1 శాతం మాత్రమే నమోదైంది. మైనింగ్‌ సెక్టార్‌లో 2011`12 నాలుగో తైమ్రాసికంలో 5.2 శాతం వృద్ధి నమోదు కాగా.. 2012`13 సంవత్సరంలో కేవలం 0.6 శాతం మాత్రమే నమోదైంది. అలాగే, వ్యవసాయం, విద్యుత్‌, గ్యాస్‌, నిర్మాణ రంగాల్లోనూ తిరోగమనమే నెలకొంది. అయితే, సర్వీస్‌ సెక్టార్‌తో పాటు ఇన్సూరెన్స్‌, రియల్‌ ఎస్టేట్‌, వాణిజ్య, రవాణా, కమ్యూనికేషన్ల రంగంలో మాత్రం వృద్ధి రేటు పెరగడం గమనార్హం.