వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన వీరవనిత చాకలి ఐలమ్మ
– సర్పంచ్ షేక్ సలీమ రంజాన్ హుజూర్ నగర్, సెప్టెంబర్ 10 (జనం సాక్షి): భూమికోసం, భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన వీరవనిత చాకలి ఐలమ్మ అని సర్పంచ్ షేక్ సలీమరంజాన్ అన్నారు. శనివారం
మండల పరిధిలోని బూరుగడ్డ మాచవరం గ్రామపంచాయతీ నందు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 37 వ వర్ధంతిని గ్రామ సర్పంచ్ షేక్ సలీమ రంజాన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో రజక రిజర్వేషన్ సమితి జిల్లా అధ్యక్షులు గూడెపు నాగలింగం, ఉప సర్పంచ్ శీలం ఆదెమ్మ, ఆవుల వెంకటయ్య, గండు చిన్న సైదులు, షేక్ అలీ, గువ్వల అయోధ్య, నందిగామ చిన్న రాములు, సోమగాని నాగేశ్వరావు, తుమ్మల మట్టపల్లి, గూడెపు గురవయ్య, పొదిల శ్రీను, కారంగుల లింగయ్య, చిక్కుళ్ల వీరబాబు, ఆవుల రామాంజనేయులు, వట్టేపు మధు, నందిగామ వేణు తదితరులు పాల్గొన్నారు.