వెయ్యి ఆలోచనలు ఘర్షించనీ…. వందపూలు వికసించనీ
…బంగారు తెలంగాణ లోనూ ఉద్యమ స్ఫూర్తి కావాలి
…అనుమానాలు పటాపంచల్ …ఒకే వేదికపై ఉద్యమ దిగ్గజాలు
…పునర్నిర్మాణం జరిగే వరకూ పోరాటపటిమ కొనసాగాలి
…జనంసాక్షి ప్రత్యేక కథనం
ెహైదరాబా ద్ నవరి3(జనంసాక్షి)
ఒక గమ్యం.. ఒక మహొన్నత లక్ష్యం.. ఒక మహత్తర పోరాటం.. ఎగిసిపడ్డ ఉద్యమ కెరటం.. ఎన్నో మలుపులు.. మరెన్నో మజీలీలు.. గమ్యం ముద్దాడింది… అంతిమ గమ్యం చేరాల్సి ఉంది. భౌగోళిక తెలంగాణ బంగారు తెలంగాణగా మార్చాల్సి ఉంది. అడుగడుగున సీమాంధ్ర మీడియా నాడు నేడు వక్రీకరణ శాపనార్థాలు, వెర్రితలలు, వెక్కిరింతలు.. తాజాగా కోదండరాం, కేసీఆర్ మధ్య పూడ్చుకోలేని ఆగాదం ఏర్పడిందనీ చిలువలు పలవలుగా ప్రచారం చేసింది. వీటిని పటాపంచలు చేస్తు ఉద్యమ దిగ్గజాలు టీఎన్జీవో డైరీ ఆవిష్కరణలో ఒకే వేదికపై ఆసీనులై చిరునవ్వులు చిందిస్తూ ముచ్చటించుకున్నారు. ఇది చూసి తలెక్కడ పెట్టుకోవాలే అర్థం కాలేదు కొందరికి. ఏదో బాధ పాపం.. ప్రపంచ చరిత్రలో ఓ గొప్ప పోరాటానికి నాయకత్వం వహించిన మావో చెప్పినట్టు వెయ్యి ఆలోచనలు ఘర్షించనీ.. వంద పూలు వికసించనీ.. తెలంగాణ పునర్ నిర్మాణంలో ఇదే జరగనీ.. బంగారు తెలంగాణ ఆవిష్కరించుకుందాం…
ఒక ఆలోచన జీవితాన్నే మార్చేస్తుంది. ఒక సంకల్పం చరిత్రను సృష్టిస్తుంది. అలాగే కోటి రత్నాల వీణ నా తెలంగాణ అనీ మహాకవి దాశరథి ఏనాడో నినదించారు. ఆయనే కాదు ఎందరో కవులు ప్రజాఉద్యమ నేతలు తెలంగాణ సాధన కోసం కలలుగన్నారు. ఎంతో శ్రమించారు. తెలంగాణలో ప్రతి వ్యక్తి ఉద్యమ పౌరుషం రగిలించుకుని కదంతోక్కారు. ఆ ఉద్యమ రథాన్ని కేసీఆర్, కోదండరాం తదితర నేతలు మరింత ముందుకు తీసుకెళ్లి తమ లక్ష్యం సాధించిన వరకు పోరాడారు. ఎంతో విప్లవ స్ఫూర్తితో కొన్నేెళ్లుగా సాగిన పోరాట ఫలితమే నేటి కోటి రత్నాల తెలంగాణ. ఈ తెలంగాణ బంగారు భూమిగా అభ్యుదయ గాంధీగా రూపొందడానికి వెయ్యి ఆలోచనలు ఘర్షించాలి. ఆ ఘర్షణలోనే వంద పూలు వికసించాలి. ఆలోచనలు ఘర్షించడమంటే వ్యక్తి గత విభేధాలతో కుమ్ములాడుకోవడం కాదు. సిగపట్లు పట్టుకోని ఒకరి పరువు మరొకరు బజారునకీడ్చడం కాదు. మేథావుల మెదళ్లలో మొలచిన ఆలోచనలు సంఘర్షిస్తేనే సదాశయాల సంకల్పం చిగురించి శాఖలుగా విస్తరిస్తుంది. ఈ నేపధ్యంలో టీఆర్‌ఎస్ నేత ముఖ్యమంత్రి కేసీఆర్, ఉద్యమంలో ప్రముఖ ప్రాత వహించిన జేఏసీ నేత కోదండరామ్ నిత్యం ఆలోచనల సంఘర్షణలతో ఉత్తేజం కలిగిస్తున్నారు తప్ప సీమాంధ్ర మీడియా సాగించిన విషప్రచారంలా వారిమధ్య ఎలాంటి భేషజాలు, విద్వేషాలు లేవు. ఒకరికొకరు తోడై ఉద్యమం సమిష్టిగా సాగించిన ఈ మహానేతల మధ్య సామాన్యమైన స్పర్థలకు అసలు చోటు లేదు. తెలంగాణను భారతదేశంలోనే కాదు యావత్తు ప్రపంచంలోనే అగ్రస్థానం వహించేలా తీర్చిదిద్దాలాన్న తాపత్రయం ఈ ఉభయ నేతల మెదళ్లను తొలిచేస్తోంది. ఆహ్లాదకరమైన వాతావరణం, సమశీతోష్ణత స్థితి, పుష్కలమైన సహజ వనరులతో విలసిల్లే తెలంగాణను ఆదర్శనీయంగా అభివృద్ధి పథంలో సాగించడానికి అనేక మంది ప్రముఖుల ఆలోచనలు, సహాయ సహకారాలు కావాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వంతో పాటు ఇరుగుపోరుగు దేశాల మైత్రి కూడా తెలంగాణను స్వర్ణమయం చేయడానికి ఎంతో అవసరమవుతుంది. ఈ దృక్పధంతో కేసీఆర్ అందరీని కలుపుకొని పోతున్నారు. రాజకీయాలకు దూరంగా రాష్ట్ర ప్రయోజనాలపైనే దృష్టిపెడుతున్నారు. ఉన్న సహజ నీటి వనరులను సద్వినియోగం చేసుకోవాలని ఏ నీటిచుక్క వృధాకారాదనీ తెలంగాణ నేలపై బంగారు పంటలు పండాలనీ ఆలోచిస్తున్నారు. ఆమేరకు పథకాలను రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఎన్నో పరిశ్రమలకు వేదికగా నిలిచిన హైదరాబాద్ నగరంలో మరిన్ని పరిశ్రమల ఏర్పాటుకు ప్రవాస భారతీయులతో పాటు విదేశి పెట్టుబడుదారులకు స్వాగతం పలుకుతున్నారు. ఈ తరుణంలో రాష్ట్ర ప్రగతికి ఎవరు ఎటువంటి సలహాలు, సూచనలు అందించినా సహృదయంతో అందిపుచ్చుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శం కావాలన్నదే కేసీఆర్ ఆకాంక్ష. ఇది నేరవేర్చడానికి ఎందరో మహానుభావులు తమ చేదోడు అందిస్తున్నారనడం అతిశయోక్తి కాదు.