వెలిదండ పోరాటల గడ్డలో పూచిన ఎర్రని మందారం కామ్రేడ్ చెనగాని కాశయ్య
గరిడేపల్లి, సెప్టెంబర్1(జనం సాక్షి):వెలిదండ ప్రాంతంలో అనేక రకాల ఆటుపోట్లు నిర్భందాలను కష్టాలను నష్టాలను ఎదుర్కొని కమ్యూనిస్టు పార్టీ ని నిర్మించిన నాయకులలో కామ్రేడ్ చెనగాని కాశయ్య ఒకరని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ గన్నా చంద్రశేఖర్ అన్నారు.
మండలంలోని వెలిదండ గ్రామంలో అనారోగ్యంతో రాత్రి మరణించిన సిపిఐ సీనియర్ నాయకులు కామ్రేడ్ చెనగాని కాశయ్య అంత్యక్రియలలో పాల్గొని వారి ప్రార్థివదేహంపై అరుణ పతాకాన్ని కప్పి విప్లవ జోహార్లు నర్పించినారు. ఈ సందర్బంగా అంత్యక్రియలకు హాజరైన నాయకులు మాట్లాడుతూ పార్టీ కోసం పేద ప్రజల కోసం తన యావదాస్తిని దారబోసిన వ్యక్తి అని ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా ఎత్తిన జెండాను తన జీవితం చివరి వరకు సిపిఐ పార్టీ లో కొనసాగి అమరుడైన కామ్రేడ్ కాశయ్య జీవితం అందరికి ఆదర్శప్రాయం అని వారి ఆశయ సాధనకు కృషి చేయడమే వారికి మనం అర్పించే ఘనమైన నివాళులు అని వారు అన్నారు. వీరు సిపిఐ పార్టీ మండల నాయకులు గా గ్రామ ఉప సర్పంచ్ గా కోఆపరేటివ్ ఉప చైర్మన్ గా పనిచేసి గ్రామ అభివృద్ధి లో కూడా తన వంతు పాత్రను ఫోషించారు.ఈ అంత్యక్రియలలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పాలకూరి బాబు, మండవ వెంకటేశ్వర్లు, సిపిఐ మండల కార్యవర్గ సభ్యులు త్రిపురం సుధాకర్ రెడ్డి, కడియాల అప్పయ్య, గ్రామ సిపిఐ కార్యదర్శి మామిడి శ్రీను,ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి బాదే నర్సయ్య మండల కాంగ్రెస్ నాయకులు కందుల వెంకటేశ్వర్లు, చెనగాని సాంబయ్య, సిపిఐఎంల్ న్యూ డెమోక్రసీ డివిజన్ నాయకులు పోటు లక్ష్మయ్య, ఆధురి కోటయ్య, సిపిఎం నాయకులు యానాల సోమయ్య, తెరాస నాయకులు పెండెం వీరాస్వామి, బార్ అసోషియెషన్ నాయకులు సాముల రాంరెడ్డి, నట్టే సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.