వెలిమినేడు డేరా బాబా భూముల్లో ఎర్ర జెండాలు

 

నల్లగొండ,ఆగస్టు30 : నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో డేరా బాబా గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ కు చెందిన భూముల్లో బుధవారం సీపీఎం పార్టీ నాయకులు జెండాలు పాతారు. డేరా స్వచ్ఛా సౌదా చీఫ్‌ గుర్మీత్‌ సింగ్‌ కు వెలిమినేడులో జాతీయ రహదారి పక్కన 56 ఎకరాల భూమి ఉంది. అయితే డేరా బాబాకు అత్యాచారం కేసుల్లో 20 సంవత్సరాల జైలు శిక్ష పడ్డ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వెలిమినేడులో బాబా భూముల్లో ఎర్రజెండాలు పాతి గుర్మీత్‌ ప్లెక్సీలు, ఫోటోలను ధ్వంసం చేశారు.