వేయిస్తంభాల గుడిలో గవర్నర్ ప్రత్యేక పూజలు
వరంగల్, మార్చి 25: గవర్నర్ నరసింహన్ కాకతీయుల కళాకండాలకు ముగ్ధుడయ్యారు. బుధవారం ఉదయం హన్మకొండలోని వేయిస్తంభాల గుడిలో రుద్రేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాకతీయ రాజులు చెక్కించిన పలు శిల్పాలను దర్శించి.. వాటి వివరాలు తెలుసుకున్నారు.