వేసవిలో తాగునీటి కలెక్టర్‌ కార్యాచరణ

కలెక్టరేట్‌, జనంసాక్షి: వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణతోపాటు పారి శుధ్యం మెరుగుపర్చేందుకు కలెక్టర్‌ కార్యాచరణ ప్రకటించారు. ఇందులో భాగంగా ఈ నెల 9నుంచి 14 వరకు జిల్లాలోని 221 మేజర్‌ గ్రామ పంచాయతీల్లో స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో ఎంపీడీవోలు, తహశీల్దార్లు, మండల ప్రత్యేక అధికారులతో గురువారం సమావేశమయ్యారు.

గామ, మండల ప్రత్యేక అధికారులు ఈనెల ఎనిమిదో తేదీ వరకు గ్రామాల్లో పర్యటించాలని, తాగునీరు… పరిసరాల

పరిశుభ్రతపై స్పెషల్‌ డ్రైవ్‌కు సిద్ధంగా ఉండాలని సూచించారు. 9,10 తేదీల్లో మురికినీటి కాలువలలో పూడికతీత, నీటి నిల్వలను తొలగించే పనులు చేపట్టాలని తెలిపారు. 12న ఓవర్‌హెడ్‌ ట్యాంకుల్లో క్లోరినేషన్‌, పిట్‌ ట్యాప్‌లు తొలగించుట, పైపులైన్ల లీకేజీలు అరికట్టాలని పేర్కొన్నారు. 13న గ్రామాల్లో వైద్య శిబిరాలు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాల సమీక్షి, పూర్తయిన వాటికి చెక్కులు పంపిణీలో ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలని తెలిపారు. 14న ప్రత్యేక అధికారులతో సమావేశమై సీఆర్‌ఎఫ్‌, నాన్‌ సీఆర్‌ఎఫ్‌ కింద బోర్ల మరమ్మతు, లోతు పెంచడం, పైప్‌లైన్లు వేయడం వంటి పనులకు పంచాయతీ నిధులు ఖర్చు చేయాలని చూచించారు.