వ్యవ’సాయం’ అందించండి

3

నాబార్డు చైర్మన్‌ను కోరిన సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌,మార్చి17(జనంసాక్షి): తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయటానికి నిధులు మంజూరు చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌  నాబార్డు చైర్మన్‌ను కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో నాబార్డ్‌ చైర్మన్‌ హర్షకుమార్‌ సమావేశమయ్యారు. వ్యవసాయ యాంత్రీకరణ, మిషన్‌ కాకతీయ పథకాలపై చర్చించారు. రాష్ట్రంలో చేపట్టే వ్యవసాయ అభివృద్ధి పథకాలకు సాయం ఇవ్వాలని కేసీఆర్‌ కోరారు. భూసార పరీక్షలు, మట్టి నమూనాలు గుర్తింపునకు కూడా సహకరించాలని నాబార్డ్‌  చైర్మన్‌కు సీఎం విజ్ఞప్తిచేశారు.