*వ్యవసాయం తర్వాత గొర్రెల పెంపకానికే ప్రాధాన్యం*: వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి.

పెబ్బేరు జూలై 19 ( జనంసాక్షి ): పెబ్బేరు లో మంగళవారం గొర్రెలకు ఉచ్చిత నీలి నాలుక వ్యాధి వ్యాక్సినేషన్ ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డీ నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో గొర్రెలు పెంపకానికి ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు.
అందుకే సబ్సిడీపై గొర్రెల యూనిట్లు మంజూరు .ఏడాదికి నాలుగు సార్లు ఉచితంగా నట్టల నివారణ మందులు పంపిణీ. కొత్తగా నీలి నాలుక వ్యాధి (జొల్లు) నివారణకు ఉచితంగా వ్యాక్సిన్ పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు.
ఒక్క పెబ్బేరు గ్రామంలో 6 వేల సబ్సిడీ గొర్రెలకు గాను రూ.2.5 కోట్లు ఖర్చు  వనపర్తి జిల్లాలో నాలుగు లక్షల గొర్రెలకు ఉచిత మందులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. మిగితావారికి త్వరలోనే పంపిణి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో  మున్సిపల్ చైర్మన్ కరుణ శ్రీ, సాయినాథ్,మార్కెట్ కమిటీ చైర్మన్ శ్యామల మన్యం, కౌన్సిలర్లు సుమతి, పద్మ,  ఎల్లారెడ్డి, టిఆర్ఎస్ నాయకులు వనం రాములు, దిలీప్ కుమార్ రెడ్డి, మజీద్, బాలరాం తదితరులు పాల్గొన్నారు.
2 Attachments