వ్యవసాయ మహిళా కూలి పాము కాటుకి మృతి

టేకులపల్లి, అక్టోబర్ 22( జనం సాక్షి): పత్తి చేలో పత్తి తీయడానికి వెళ్లిన వ్యవసాయ మహిళా కూలి పాము కాటుకు గురై మృతి చెందిన సంఘటన శుక్రవారం సాయంత్రం మండలంలోని కొత్త తండా గ్రామం లో జరిగింది. గొల్లపల్లి కొత్త తండా కు చెందిన బానోతు సుగుణ(45) కూలి పనుల్లో భాగంగా పత్తి తీయడానికి శుక్రవారం వెళ్లి పత్తి తీస్తున్న క్రమంలో పాము కాటు వేసింది. దీంతో ఆమెను వెంటనే కొత్తగూడెం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ ఆమె పరిస్థితి విషమించడంతో ఖమ్మం పట్టణానికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. మృతురాలికి భర్త బద్దు, కుమారుడు చరణ్ ఉన్నారు. కొత్త తండాలోని సుగుణ భౌతికాయాన్ని జిల్లా సిపిఐ కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాష, టేకులపల్లి సిపిఐ మండల కార్యదర్శి, జిల్లా కౌన్సిల్ సభ్యులు గుగులోతు రామచందర్, నల్ల మాస తేజం సందర్శించి భౌతికాయంపై పార్టీ జెండాను కప్పి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అయిత శ్రీరాములు, టేకులపల్లి మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బొమ్మెర్ల వరప్రసాద్, కోరుకుప్పల వెంకన్న,సాములు, శంకర్,బౌసింగ్, శాంతా, రమేష్ పూల్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.