వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే ఆలోచనను మానుకోవాలి
మల్లు నాగార్జునరెడ్డి హుజూర్ నగర్ అక్టోబర్ 15 (జనం సాక్షి): కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రైతుల వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే ఆలోచనను మానుకోవాలని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లు నాగార్జున్ రెడ్డి అన్నారు. శనివారం హుజూర్ నగర్ పట్టణంలో అమరవీరుల స్మారక భవనంలో రైతు సంఘం 3వ మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ నిత్యం అష్ట కష్టాలు పడుతున్న వ్యవసాయ కార్మికుల గోడును పట్టించుకోవడంలో కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా వైఫల్యం చెందాయని విమర్శించారు. రైతుకు వ్యతిరేకమైన నల్ల చట్టాన్ని రద్దు చేసే వరకు పోరాటాలు నిర్వహించడం జరుగుతుందని, లక్ష లోపు రుణమాఫీ వడ్డీతో సహా మాఫీ చేయాలని, రైతులకు బ్యాంకుల ద్వారా కొత్త రుణాలు ఇవ్వాలని, వర్షంతో పంట నష్ట పోయిన రైతులను ఆదుకోవాలని, గ్రామాలలో ఐకేపీ కేంద్రాలు త్వరగా ప్రారంభించాలి అని అన్నారు. పెరిగిన గ్యాస్, డీజిల్, పెట్రోల్, నిత్యావసర సరుకుల ధరలు నియంత్రించాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం13 మందితో నూతన కమిటీని ఏర్పాటు చేసారు. పట్టణ అధ్యక్షుడిగా పాశం వీరబాబు, పట్టణ కార్యదర్శిగా రేపాకుల మురళి ను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు నాగరపు పాండు, జిల్లా రైతు సంఘం ఉపాధ్యక్షులు పల్లా వెంకట్ రెడ్డి, రైతు సంఘం సహాయ కార్యదర్శి దుగ్గి బ్రహ్మం, మత్స్య కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శీలం శ్రీను, సి ఐ యూ నాయకులు ఒట్టేపు సైదులు, టి. యోనా, చిన్నం వీరమల్లు, జక్కుల వెంకటేశ్వర్లు, పి వెంకట్ నారాయణ, సాయిబాబు, రాజేష్ ,కే వెంకన్న , ఆర్ వెంకన్న ,ఎస్ వెంకన్న , గోవిందమ్మ, భద్రమ్మ , ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.