వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మట్టి నమూనాల సేకరణ
దంతాలపల్లి: నర్సింహులపేట మండలంలోని రామవరం గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సోమవారం మట్టినమూనాలను సేకరించారు. భూసారం ఆధారంగా ఎరువుల వినియోగం పంటల దిగుబడులపై రైతులకు అవగాహన కల్పించినట్లు మండల వ్యవసాయ అధికారి పి. హరిప్రసాద్‌బాబు తెలిపారు. రైతులు భూసార పరీక్షలు చేసుకోవడం ద్వారా మంచి దిగుబడి సాధించవచ్చని ఆయన తెలిపారు.