శంకర్ నాయక్‌కు మద్దతుగా ప్రచారం
మహబూబాబాద్,అక్టోబర్30(జనంసాక్షి ): మానుకోట ఎమ్మెల్యే అభ్యర్థి బానోత్ శంకర్‌నాయక్‌ను అత్యధిక
మెజార్టీతో గెలిపిద్దామని రైతు సమితి జిల్లా కో ఆర్డినేటర్ భూ క్యా బాలాజీ నాయక్ కోరారు.
కాంగ్రెస్ కుట్రలకు మోసపోయి గోసపడొద్దని అన్నారు. శివారు తండ ల్లో టీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి జోరుగా ప్రచారం నిర్వహించారు. రైతు కూలీలను కలిసి శంకర్‌నాయక్ కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. మాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్ నాలుగున్నరేండ్లుగా ప్రజలకు అందుబాటులో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడ్డారని, తండాతండాకు సీసీ రోడ్లు వేయించారని తెలిపారు.శంకర్‌నాయక్‌కు మరో అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధిలో రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలుపుతారని తెలిపారు. కేసీఆర్‌కు మళ్లీ పట్టంకట్టి రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చుకుందామన్నారు. నాయకులతో కలిసి ఇంటింటి ప్ర చారం నిర్వహించారు. బానోత్ శంకర్‌నాయక్ కారుగుర్తుకు ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించారు.