శాంతియుత సమాజమే పోలీసుల లక్ష్యం

 విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం

 జిల్లా ఎస్పి  జె. సురేందర్ రెడ్డి

భూపాలపల్లి బ్యూరో, అక్టోబర్ 21 (జనంసాక్షి):

విధి నిర్వహణలో దేశ రక్షణ కోసం ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరవీరుల సంస్మరణ పోలీస్ ఫ్లాగ్ డే ను జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు.

జిల్లా కేంద్రంలోని అర్ముడ్ రిజర్వు ప్రధాన కార్యాలయంలోనీ అమరవీరుల స్తూపం వద్ద శుక్రవారం ఎస్పీ  జె. సురేందర్ రెడ్డి అదనపు ఎస్పీ వి. శ్రీనివాసులు, పోలీస్ అధికారులు, అమరవీరుల కుటుంబ సభ్యులు  నివాళులర్పించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పి  మాట్లాడుతూ,

పోలీసు అమరుల త్యాగం భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని చెప్పారు. ప్రజావసరాల కోసం, సంరక్షణ కోసం ఏర్పడ్డ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ అన్నారు.శాంతిభద్రతల పరిరక్షణతో పాటు దేశ అంతర్గత భద్రత ప్రజల రక్షణ, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ ఇలా ప్రతి సందర్భాల్లోనూ పోలీస్ వ్యవస్థ చాలా కీలకంగా పని చేస్తుందన్నారు.శాంతిభద్రతలు సక్రమంగా ఉంటే మారుమూల గ్రామాలకు కూడా అభివృద్ధి సాధ్యమవుతుందని ఎస్పి  తెలిపారు. అక్టోబర్ 21 నుంచి అక్టోబర్ 31 వరకు జాతీయ ఐక్యత కోసం ప్రజలకు పోలీసులు మరింత చేరువయ్యేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. అక్టోబర్ 21,1959 సంవత్సరం లో సిఆర్పిఎఫ్ ఎస్.ఐ కరమ్ సింగ్ నాయకత్వంలోని 20 మంది భారత జవాన్లు కలసి లడక్ ప్రాంతంలో హాట్ స్ట్రింగ్ వద్ద విధులు నిర్వహిస్తుండగా చైనా ఆర్మీ మన వారి పై దాడి చేసి 10 మందిని హతమార్చడంతో, అప్పటి నుండి దేశ వ్యాప్తంగా విధి నిర్వహణ లో అసువులు బాసిన పోలీసులను స్మరిస్తూ ప్రతి ఏడాది అక్టోబర్-21 న పోలీసు అమరవీరుల సంస్మరణ దినంగా ప్రభుత్వం పాటిస్తుందన్నారు.పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంను గత సంవత్సరం నుండి పోలీస్ ఫ్లాగ్ డే గా జరుపుకుంటున్నాం అని అన్నారు..పోలీసు వ్యవస్థ పటిష్టంగా ఉంటే అభివృద్ధి ప్రతి ఒక్కరికి చేరుతుందనీ పేర్కొన్నారు.ఈ కార్యక్రమానికి అమరులైన కుటుంబాలకు సంబందించిన కుటుంబ సభ్యులు హాజరై నివాళ్ళు అర్పించడం జరిగింది. ఎస్పి గారు, త్యాగమూర్తుల కుటుంబాల సభ్యులతో మాట్లాడి వారి కుటుంబ పరిస్థుతులు వారి యొక్క సమస్యలను అడిగి వారు చెప్పిన సమస్యలను సాద్యమైనoత తొందరగా పరిష్కరిస్తాం అని తెలిపారు.అమరవీరుల కుటుంబాలకు బహుమతులు  అందించారు. అంతకు ముందు, పోలీసు అధికారులు, సిబ్బంది, పోలీసు అమరవీరుల  కుటుంబాలతో ఎస్పి  జె. సురేందర్ రెడ్డి  భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు.కార్యక్రమంలో డిఎస్పీ లు ఏ. రాములు, రామ్ మోహన్ రెడ్డి,కిషోర్ కుమార్, జిల్లా పరిధిలోని ఇన్స్పెక్టర్ లు, SI లు, అమరవీరుల కుటుంబ సభ్యులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

3 Attachments • Scanned by Gmail