*శిథిలావస్థలో ఒంటరి పల్లి పాఠశాల!

*భవనం పెచ్చులూడుతున్న పట్టించుకోని అధికారులు

లింగంపేట్ 17 ఆగస్టు (జనంసాక్షి)
లింగంపేట్ మండలంలోని ఒంటరిపల్లి ప్రాథమిక పాఠశాల భవనం పెచ్చులూడి శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారిన అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామ సర్పంచ్ రాజయ్య ఆవేదన వ్యక్తం చేశారు.ఈ పాఠశాల భవణం 40 సంవత్సరాల క్రితం కట్టిన పురాతన భవనమన్నారు.ఇట్టి పాఠశాలలో 1 నుండి ఐదవ తరగతి వరకు బోధన జరుగుతుందని తెలిపారు.ఈ పాఠశాలో విద్యార్థులు 40 మంది వరకు ఉన్నారని.ఇట్టి విషయంలో పలుసార్లు అధికారులకు చెప్పిన పట్టించు కోవడంలేదని ఆయన పేర్కొన్నారు.భవనం పెచ్చులూడి విద్యార్థుల పై పడే అవకాశం ఉందని ఆయన అన్నారు.ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోక ముందే చర్యలు చేపట్టాలన్నారు.పాఠశాలకు నూతన భవనం మంజూరు చేయాలని ఆయన ఉన్నతాదికారులను కోరారు.