శేషాచలం అడవుల్లో తుపాకుల గర్జన

4

20 మంది ఎర్రచందనం కూలీల కాల్చివేత

దాడికి యత్నించారు

ఆత్మరక్షణార్థం కాల్పులు జరిపాం..పోలీసులు

చిత్తూరు,ఏప్రిల్‌7(జనంసాక్షి): చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంశేషాచల అటవీ ప్రాంతంలో మంగళవారం  తెల్లవారు జామున జరిగిన పోలీసు కాల్పుల ఘటనలో 20 మంది కూలీలు హతమయ్యారు. రెండు వేర్వేరు వీరు హతమైనట్లు పోలీసులు తెలి పారు. గతకొంతకాలంగా ఎర్రచందనం అక్రమాలపై గట్టి నిఘా పెట్టి కూంబింగ్‌ చేస్తున్న పోలీసులపై అడవుల్లో వీరు దాడులకు దిగారు. కత్తులు,రాళ్లతో దాడికి దిగగా పోలీసులు ఎదురుకాల్పులకు దిగడంతో 20మంది కూలీలు హతమయ్యారు. పలువురు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. తెల్లవారుజామున 3గంటల సమయంలో ఈ భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. శ్రీవారిమెట్టు సవిూపంలోని ఈతగుంట, టీగితీగలకోన వద్ద కూంబింగ్‌ నిర్వహిస్తున్న ప్రత్యేక పోలీసు దళం, అటవీశాఖ సిబ్బందిపై తొలుతు స్మగ్లర్లు తిరగబడ్డారు. దీంతో ఎర్రచందనం స్మగ్లర్లు, పోలీసుల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. కాల్పుల్లో ఈతగుంట వద్ద 9మంది, పచ్చినోడుబండ బండ వద్ద 11 మంది ఎర్రచందనం కూలీలు మృతి చెందినట్లు స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ డీఐజీ కాంతారావు తెలిపారు. మృతులు తమిళనాడు లోని వేలూరు జిల్లాకు చెందిన కూలీలుగా భావిస్తున్నారు. కూలీల రాళ్లదాడిలో ఇద్దరు పోలీసు సిబ్బందికి తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది. గాయపడిన కొందరు కూలీలు పరారయ్యారు.

చంద్రగిరి మండలం ఈతగుంట దగ్గర పోలీసులు- అటవీ శాఖ అధికారుల స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ కూంబింగ్‌ నిర్వహిస్తున్న సమయంలో స్మగ్లర్లు ఎదురుపడటంతో లొంగిపోవాల్సిందిగా హెచ్చరించారు. అయినా వినకుండా వారు మొదట రాళ్లదాడి జరిగింది. ఆ తరువాత టాస్క్‌ఫోర్స్‌ బృందానికి ఎర్రచందనం స్మగ్లర్లకు మధ్య కాల్పులు జరిగాయి. ఇరువురి మధ్య జరిగిన ¬రా¬రీ కాల్పుల్లో 20 మంది స్మగ్లర్లు మృతి చెందారు. శ్రీనివాసమంగాపురం దగ్గర 11 మంది, శ్రీవారి మెట్ల దగ్గర 9 మంది స్మగ్లర్లు ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు. హతుల్లో ఇద్దరు అంతర్జాతీయ స్మగ్లర్లు ఉన్నట్లు తెలుస్తోంది.ఎన్‌కౌంటర్‌లో 10 మంది పోలీసులకూ గాయాలవడంతో వారిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. రెండు రోజుల క్రితం చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో స్మగ్లర్లు  500 మంది కూలీలను దింపారన్న పక్కా సమాచారంతో టాస్క్‌ఫోర్స్‌ కూంబింగ్‌ నిర్వహించింది. శేషాచల అటవీప్రాంతంలో ఈ తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రదేశాన్ని స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ డీఐజీ కాంతారావు పరిశీలించారు. ఎన్‌కౌంటర్‌ ఘటనలో గాయపడి పరారైన స్మగ్లర్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఎన్‌కౌంటర్‌ ఘటనతో పోలీసులు, అటవీశాఖ సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఎన్‌కౌంటర్‌లో పోలీసులపై దాడి చేసి తప్పించుకున్న ఎర్రచందనం స్మగ్లర్లు, కూలీల కోసం కూంబింగ్‌ కొనసాగుతోంది. జిల్లా సరిహద్దుల్లోని అన్ని చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు ముమ్మరం చేశారు.

కాల్పుల్లో 20మంది చనిపోయారు: చిన రాజప్ప

శేషాచల అటవీప్రాంతంలో రెండు చోట్ల జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 20 మంది ఎర్రచందనం కూలీలు మృతి చెందినట్లు ఏపీ ¬ం మంత్రి చినరాజప్ప ప్రకటించారు. పరారైన ఎర్రచందనం కూలీల కోసం కూంబింగ్‌ కొనసాగుతోందని వెల్లడించారు. స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు, అటవీశాఖ సిబ్బంది కార్యాచరణలో పాల్గొన్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుతో డీజీపీ జేవీ రాముడు భేటీ అయ్యారు. శ్రీవారి మెట్టు ప్రాంతంలో ఎదురుకాల్పుల ఘటనపై డీజీపీ వివరణ ఇచ్చినట్లు సమాచారం. ఎన్‌కౌంటర్‌ వివరాలను బాబుకు తెలియచేశారు.

శేషాచలం ఎన్‌కౌంటర్‌పై తమిళనాట ఆందోళన

ఆంధ్ర ప్రదేశ్‌లోని శేషాచలం అడవుల్లో ఎర్ర చందనం స్మగ్లర్లనే అనుమానంతో 20 మందిని కాల్చి చంపడంతో తమిళనాడు భగ్గుమంది. ఈ ఘటనపై సిఎం పన్నీర్‌ సెల్వం సవిూక్షించారు. చిత్తూరు జిల్లాలో జరిగిన ఎన్‌ కౌంటర్‌ ఘటనపై తమిళనాడు సీఎం ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఇదిలావుంటే చనిపోయిన వారిలో తమిళనాడుకు చెందిన వలస కూలీలు ఉన్నారు. దీనితో సహజంగానే తమిళనాడులో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఎన్‌కౌంటర్‌ ఆమోద యోగ్యం కాదంటూ ఎండీఎంకే అధ్యక్షుడు వైకో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్‌కౌంటర్‌పై సమగ్ర విచారణ జరపాలని కాంగ్రెస్‌ నేత ఇళంగోవన్‌ డిమాండు చేశారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని కరణానిధి ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. తమిళ సంఘాలు పక్క రాష్ట్ర సీఎం చంద్రబాబు దిష్టి బొమ్మను దహనం చేశాయి.