శ్రమ దోపిడికి గురవుతున్న బీడీ కార్మికులు

– సిఐటియు నాయకులు రామస్వామి
వరంగల్ ఈస్ట్, జూలై 19(జనం సాక్షి)
కరీమాబాద్ ఉర్స్ బొడ్రాయి 40 డివిజన్ లో  బీడీ కార్మికుల సమస్యలపై  సిఐటియు ఆధ్వర్యంలో సర్వే మంగళవారం నిర్వహించడం జరిగింది
ఈ సర్వే కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ముక్కెర రామస్వామి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ రోజు రోజుకు బీడీ పరిశ్రమలు మూత పడుతూ వేల మంది బీడీ కార్మికుల  పని కోల్పోతున్న పరిస్థితి వచ్చిందన్నారు
 సిఐటియు ఆధ్వర్యంలో  బీడీ కార్మికులను సర్వే నిర్వహిత్తే అనేక సమస్యలు ఈ ప్రాంతంలో  వెలుగులోకి వచ్చాయి  40వ డివిజన్ లో  సుమారు రెండు వేల మంది వరకు  బీడి కార్మికులు ఉంటారు పది కర్కాణాల్లో పని చేస్తూ ఉంటారన్నారు  ప్రధానంగా శ్రమదోపిడికి గురవుతున్నారు  ముఖ్యంగా ఒక్క కార్మికురాలికి  కిలో ఆకు వేస్తే ఏడు వందల యాభై గ్రాముల ఆకు మాత్రమే వస్తుంది  పొగకు వేస్తే 400 గ్రాముల వేస్తే  అది 150 గ్రాముల పొగాకు తక్కువ వస్తోంది తక్కువ వచ్చినా ఆకు పొగాకు సుమారు 55 రూపాయలు నష్టం జరుగుతుంది రామస్వామి పేర్కొన్నారు
 వెయ్యి ఆకు పొగాకు వేసి 1300 వందల బీడీలు  ఇవ్వాలని యజమానులు ఒత్తిడి చేస్తూ కార్మికులను పెద్ద మొత్తం లో శ్రమను దోచుకుoటున్నారు అని ముక్కెర రామస్వామి  ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
వీరికి ప్రభుత్వం నుంచి పిఎఫ్  హెల్త్ కార్డులు పించిన్స్ లేక పని లేక ఇండ్ల కిరాయిలు కట్టలేక పెరిగిన నిత్యావసర సరుకుల ధరల వల్ల అనేక సమస్యలు ఎదుర్కొంటు చాలీ చాలని కూలితో దూరబ్బరమైన జీవితాలు గడిస్తున్నారు అని అన్నారు ఇప్పటి కైనా తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని  బీడి కార్మికులకు పని కల్పించి వారిని ఆదుకోవాలని ప్రభుత్వం ను డిమాండ్ చేశారుఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు దాయి. రాము నాయిని వంశి .ఐళ్ల దనేషు బీడి కార్మికులు బురస్వరూప మున్నీ .సుల్తానా డీ. చందన. తుమ్మ. సుగుణ తదితరులు పాల్గొన్నారు
Attachments area