శ్రీరాంనగర్ కాలనీ ప్రాథóమిక పాఠశాలకు మరమ్మతులకు
కామారెడ్డి అర్బన్ ఆగస్టు 8 (జనంసాక్షి) : జులై 19 న శ్రీరాంనగర్ కాలొనీ పాఠశాల జలమయం శీర్షిక వెలువడినది. దానికి స్పందించిన అధికారులు 4 లక్షల 50 వేల రూ.లు పాఠశాల ప్రహరీ గోడకు మంజూరు చేశారు. అదే విధంగా పాఠశాల విద్యార్థులకు టాయలెట్ల మరమ్మతుల కోసం 38 వేల రూ.లు మంజూరు అయనట్టు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శోభ తెలిపారు. నిధులను దుర్వినియోగం చేసి కాంట్రాక్టర్ టాయలెట్ల మరమ్మతు ల్లో జిమ్మిక్కులు చేసి పాత టాయలెట్ ఇనుపడోర్‌ను నూతనంగా మరమ్మతు లు చేస్తున్న వాటికి పెట్టి ఇటుకలతో కట్టి కాంట్రాక్టర్ ప్రజాధనాన్ని దుర్విని యోగం చేసి దండుకోవాలని చూడడంతో ‘జనంసాక్షి’ ప్రతినిధి స్కూల్ ప్రాంగణంకు వెళ్లి ఆధారాలతో సహా ప్రచురణకు సిద్ధమయ్యారని తెలువ గానే సదరు కాంట్రాక్టర్ హుటాహుటీన మండల పరిషత్ ప్రాధమిక పాఠశా లలో తాను కట్టించిన కట్టడాన్ని కూల్చి వేయంచి పాత ఇనుపడోర్‌ను కూల గొట్టి తీయంచి నూతన ఇనుప డోర్‌ను బిగించాడు. ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కు ప్రదానోపాధ్యాయురాలు శోభ ఫిర్యాదు చేయడంతో సదరు కాంట్రా క్టర్‌ను పిలిపించి మందలించారని ప్రధానోపాధ్యాయురాలు తెలిపారు. విద్యా ర్ధిని విద్యార్థులకు ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆట పోటీలు ఆడుకోకుండా పాఠశాల ఆవరణ గ్రౌండ్‌లో రోడ్లపై డిస్మెంటల్ చేసి వేసిన మట్టిని ఇటుకలను, సిమెంట్‌తో కూడిన ఐడర్లను, మోరీనాలల గుండా తీసిన సీస వక్కలతో కూడిన మట్టిని తీసుకువచ్చి పాఠశాల ప్రాం గణంలో పోసిన చూస్తూ ఉండిపోయన అధికారులు, పట్టించుకోని పాలకు లు. ఆగస్టు 15 ను దృష్టిలో పెట్టుకొని పాఠశాల విద్యార్ధిని విద్యార్థులకు ఆటపోటీలు ఆడడానికి వీలుగా చేయాలని విద్యార్ధి తల్లిదండ్రులు ప్రదానోపా ధ్యాయురాలిని కోరారు. విద్యార్థులకు జాతీయ జెండాను ఎగరవేయడానికి అనుగుణంగా కాంట్రాక్టర్‌చే పనులు వేగవంతం చేయాలని స్థానికులు ఆశిస్తున్నారు. ఇకనైనా సదరు కాంట్రాక్టర్లు పనిని త్వరగా ప్రారంభించాలని విద్యార్ధుల తల్లిదండ్రులు కోరుతున్నారు. కామారెడ్డి పట్టణంలోని శ్రీరాం నగర్ కాలోనీ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు మరమ్మతులు చేసి విద్యార్థిని విద్యార్ధులకు విద్యను అభ్యసించటానికి అనుగుణంగా వర్షపు నీరు ఆగకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.