శ్రీరాంపూర్ పాఠశాలలో అస్వస్థతకు గురైన విద్యార్థులు
అస్వస్థతకు గురైన విద్యార్థులను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ పాఠశాలలో స్వస్థతకు గురైన విద్యార్థులను సోమవారం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పరామర్శించారు. ఐరన్ మాత్రలు వేసుకొని అస్వస్థతకు గురైన ఘటనపై విద్యార్థులను, విద్యార్థుల తల్లిదండ్రులను ఎంఈవో వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈరోజు కూడా మళ్లి 4గురు విద్యార్థులు అస్వస్థతకు గురి కావడంపై విద్యార్థుల తల్లిదండ్రులు మంత్రి ముందు ఆందోళన వ్యక్తం చేశారు. మా పిల్లలకు అస్వస్థతకు కారణమైన ఐరన్ మాత్రల తయారీ కంపనీలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ ముత్తారం మండలంలోని మాత్రలు వేసుకొని అస్వస్థతకు గురైన ఘటనపై జిల్లా అధికారులను అప్రమాత్తం చేసి ఔషద నియంత్రణ అధికారుల ల్యాబ్‌కు పంపించడం జరిగిందన్నారు. ఈ నివేధికల ఆధారంగా సంబందిత కంపనీలపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.